ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దాడులు సంచలనం అయ్యాయి. ఈ దాడులు ఎటు వైపు తీసుకువెళ్తాయో అని ప్రజల్లో ఆందోళన ఉంది. తాజాగా రామ తీర్ధంలో జరిగిన ఘటనపై బిజెపి సీరియస్ అయింది. జనసేనతో కలిసి చలో రామతీర్ధంకు పిలుపునిచ్చింది. దీనిని పోలీసులు అడ్డుకోవడంపై బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
బీజేపీ నేతలని రామతీర్థం అనుమతించకపోతే రాష్ట్రం తగలబడిపోతుంది అని ఆయన హెచ్చరించారు. జరగబోయే పరిణామాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలి అని ఆయన డిమాండ్ చేసారు. రామతీర్థం కొండ మీదికి టీడీపీ, వైసిపిని అనుమతించి మమ్మల్ని అడ్డుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని డ్యూటీ చేయండి అని ఆయన ఎద్దేవా చేసారు.
పోలీసులకి జీతాలు ఇస్తోంది వైసీపీ ఆఫీసా..లేక రాష్ట్ర ప్రభుత్వమా అని నిలదీశారు. ఏపీలో మనవహక్కుల ఉల్లంఘనపై పోలీసుల దమన కాండ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నాము అన్నారు. 60ఏళ్ల వయసున్న సోము వీర్రాజు ని అరెస్ట్ చేయడం జగన్ పరికిపంద చర్య అన్నారు. ఏపీలో పోలీసుల ప్రభుత్వం ,పోలీసుల వైపల్యం వలనే వరుస సంఘటనలు అని మండిపడ్డారు. పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాము అన్నారు