వైసీపీలో బీసీలకు అగ్ర తాంబూలం.. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కట్టబెట్టేలా జగన్ ప్లాన్..

-

రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాలని సీరియస్ గా దృష్టి పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అందుకు తగ్గట్టుగానే సంచల నిర్ణయాలు తీసుకుంటుంది.. అభ్యర్థుల ఎంపికలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది.. అగ్రవర్ణాలుగా ఉన్న రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల కంటే బీసీ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల అభ్యర్థుల వైపే సీఎం జగన్ దృష్టి పెడుతున్నారని పార్టీలో ప్రచారం నడుస్తోంది.. ఇన్చార్జుల మార్పులో భాగంగా గతంలో పోటీ చేసిన రెడ్డి, కమ్మ అభ్యర్థుల స్థానాల్లో బీసీలకు ఎస్సీ, ఎస్టీలకు జగన్ మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ జపం పఠిస్తోంది.. వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీసీలకు కేటాయించి అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.. అందుకు సంబంధించిన ఈక్వేషన్స్ కూడా వైసిపి అధిష్టానం చూస్తోంది.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఓటర్లు ఎలాగో తమ వైపు ఉంటారని వైసీపీ భావిస్తోంది.. కమ్మ సామాజిక వర్గ నేతలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినా.. చివరికి వారు టిడిపికి ఓటు బ్యాంకుగా మారుతున్నారని.. వారి స్థానంలో నమ్మకంగా ఉండే ఓసీ నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట.. బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తే వారు నమ్మకంగా తమ పార్టీ వైపే ఉంటారని సిఎం వైఎస్ జగన్ భావిస్తున్నాని ఆయన సన్నిహితులు చెబుతున్నారు..

బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూనే.. బ్రాహ్మణ ఆర్యవైశ్య వంటి సామాజిక వర్గాలను కూడా దగ్గర చేసుకుంటుంది.. అందులో భాగంగానే విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని బీసీ మహిళా కోటాలో బొత్స ఝాన్సీ కి కేటాయించారని పార్టీ పెద్దలు చెబుతున్నారు.. గత ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా వెలమ సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్ కి అధిష్టానం అవకాశం కల్పించింది.. ఈసారి ఆయన స్థానంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన సునీల్ కుమార్ కి సీఎం జగన్ ఛాన్స్ ఇచ్చారని పార్టీలో చర్చ నడుస్తోంది.. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది..

ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలలో కూడా బీసీ అస్త్రాన్ని ప్రయోగించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట.. పార్టీకి కీలకంగా మారిన రాజధాని ప్రాంతంలోని మంగళగిరి కూడా చేనేత వర్గానికి చెందిన అభ్యర్థికే సీటు ఖరారు చేశారు.. అలాగే మరి కొన్ని చోట్ల కూడా బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి.. బీసీలకు పెద్దపీఠ వేసామనే ప్రచారం చేసుకునేలా వైసిపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. జగన్ ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version