పతంగి ఎగిరేసే టైమ్ లో జర పైలం..!

-

సంక్రాంతి పండుగ అంటే రంగు రంగుల ముగ్గులేనా? హరిదాసు కీర్తనలేనా? డూడూ బసవన్నలేనా? గొబ్బెమ్మలేనా? కాదు.. కాదు.. అంతకుమించి.. పతంగిని ఎగిరేయడం. అవును.. సంక్రాంతి పండుగకు పతంగులను ఎగరేయడం అనేది కూడా ఓ ఆనందం. అదో సందడి. రంగు రంగుల గాలి పటాలను ఎగరేస్తుంటే వచ్చే కిక్కే వేరు. అయితే.. పతంగి ఎగరేసే సంతోషంలో కోరి ప్రమాదాలు తెచ్చుకుంటారు కొంతమంది.

పతంగి ఎగిరస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అదమరిచినా అంతే సంగతులు. అందుకే.. పిల్లలు కానీ.. పెద్దలు కానీ.. పతంగులు ఎగిరేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేందో ఇప్పుడు చూద్దాం.

సైడ్ గోడ లేని బిల్డింగ్ ల మీద పతంగులు ఎగిరేయకూడదు. ఎందుకంటే.. పతంగిని ఎగిరేస్తూ పైకి చూస్తూ.. సైడ్ గోడ లేకుంటే కింద పడే ప్రమాదం ఉంది.

ఇక రద్దీగా ఉండే రోడ్ల మీద, గల్లీలో పతంగుల ఎగిరేయవద్దు. రోడ్ల మీద వెళ్లే వాహనాల వల్ల ప్రమాదం ఏర్పడొచ్చు. గల్లీల్లో పతంగులు ఎగిరేసినప్పుడు అక్కడ ఉండే కరెంట్ తీగలకు పతంగులు తాకి చిక్కుకుపోతుంటాయి. వాటిని తీసుకోవడానికి… ఇనుప రాడ్లు లేదా ఇతర వస్తువులతో కరెంట్ తీగలను కదిలించే ప్రయత్నం చేయొద్దు. కరెంట్ తీగలు చాలా ప్రమాదకరం. అందుకే.. కరెంట్ తీగలు ఉన్న ప్రాంతంలో పతంగులను ఎగరేయకపోవడమే ఉత్తమం.

పక్షులు తిరిగే ప్రాంతంలో పతంగులను అస్సలు ఎగురేయకండి. పక్షుల రెక్కలకు, కాళ్లకు మాంజా చిక్కుకొని అవి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

చెరువులు. నదులు, కుంటలు, నాలాల దగ్గర కూడా పతంగులను ఎగురేయకండి. పైకి చూసుకుంటే నీళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే… ప్లే గ్రౌండ్స్ లో, స్టేడియాల్లో, ఖాళీ ప్రదేశాల్లో ఎగరేయండి. రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్ ల దగ్గర కూడా పతంగులు ఎగిరేయవద్దు. అది చాలా డేంజర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version