మంచితనానికి పోతే అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నారు అని టీడీపీ కి చెక్ పెట్టే విధంగా గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు వైయస్ జగన్. ఉగాది లోపు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకులను మరియు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే వైసీపీలోకి రావాలనుకుంటున్నారో వాళ్లని పార్టీలోకి తీసుకోవడానికి జగన్ డోర్లు ఓపెన్ చేయటానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ ఒక్క దెబ్బతో తెలుగుదేశం పార్టీకి ఉన్నా ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో పాటు మరోపక్క అమరావతి విషయంలో కూడా జగన్ సర్కార్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది.
మరోపక్క అమరావతి ప్రాంతంలో రైతులు మరి స్థానిక ప్రజలు గత కొన్ని రోజుల నుండి పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా గాని వాటిని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందటం కోసం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలో నుండి వస్తున్న సమాచారం.