ఎప్పటికప్పుడు టీడీపీలో నమ్మకాన్ని క్రియేట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు తాపత్రయ పడుతున్నారని… జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కు ఐదేళ్లు పాలించాలని ప్రజలు ఆశీస్సులు అందించారని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రెండేళ్లకు, మూడేళ్లకు కుదించుకుని ముందస్తుకు ఎందుకు పోవాలి అని ప్రశ్నించారు. ఆయన ఐదేళ్లు పూర్తిగా వాడుకుంటారని.. వైసీపీ హామీలను పూర్తిగా నెరవేరుస్తారని సజ్జల అన్నారు. ఇది టీడీపీ పార్టీ దిక్కుమాలిన ఆలోచన అని సజ్జల విమర్శించారు. పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు ముందస్తు రాగం ఎత్తుకున్నారని ఆయన విమర్శించారు. అడుగంటిన పార్టీని కాపాడుకునేందుకే ముందస్తు ఎన్నికలు అని అంటున్నారని అన్నారు. తన పార్టీ నాయకులను టీడీపీ, జనసేన ఆహ్వానించడం హాస్యాస్పదం అని సజ్జలు అన్నారు. ఈ ఏడాది పార్టీ ప్లీనరీ, సభ్యత్వ నమోదు, పార్టీ పదవులు నింపడంతో పాటు.. నెక్స్ట్ ఎన్నికలకు ఈరోజు నుంచి ప్లానింగ్ మొదలవుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడిపై నమ్మకం లేదని.. ఆయన కొడుకుతో ఫ్యూచర్ లేదని ఆయనకు తెలిసిపోయిందని సజ్జల ఆరోపించారు.