బాబు వస్తే జాబు..అతి పెద్ద మోసం ఇదే.!

-

బాబు వస్తే జాబు..ఇది 2014 ఎన్నికల ముందు టి‌డి‌పి నినాదం. పెద్ద ఎత్తున టి‌డి‌పి ప్రచారం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన..సీనియర్ నేతగా చంద్రబాబు ఉండటం.. ఇంకా బాబు ఏదో చేస్తారని అంతా భావించారు. అందులో యువతని ఆకట్టుకోవడానికి బాబు వస్తే జాబు అంటూ ప్రచారం చేశారు. బాబు అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేస్తాయి..కంపెనీలు వచ్చేస్తాయి..పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు.

ఇక 2014 ఎన్నికల్లో బాబు వచ్చారు.. కానీ పిల్లలకు జాబులు రాలేదు. అయితే బాబు కొడుకు నారా లోకేష్‌కు మాత్రం ప్రజా క్షేత్రంలో గెలవకుండా ఎమ్మెల్సీ వచ్చింది..మంత్రి పదవి వచ్చింది..మూడు శాఖల బాధ్యతలు ఇచ్చారు. సరే యువతకు జాబులంటూ హడావిడి చేయడం కోసం అప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ..దానికి తగ్గ స్కిల్స్ నేర్పించాలనే పేరుతో అప్పటి ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పేరుతో భారీ మోసానికి తెరలేపింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. రూ. మొత్తం 371 కోట్లను ఈ స్కిల్ పథకానికి విడుదల చేసి డమ్మీ కంపెనీల పేరిట రూ. 241 కోట్లు మళ్ళీ చంద్రబాబు జేబుల్లోకి వచ్చేశాయి.

అయితే ఈ అంశాలపై అప్పుడు ప్రతిపక్ష నేత జగన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూనే వచ్చారు. అమరావతి భూ కుంభకోణం, పోలవరంలో కమిషన్లు..ఇంకా రకరకాల అక్రమాలపై ఆరోపణలు చేశారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక వీటి అంతు తేల్చి..బాబు అవినీతిని ప్రజల ముందు ఉంచాలని అనుకున్నారు. కానీ అధికారం ఉంది కదా అని ఏదొకటి చేయలేదు. అన్నిటికి పక్కా ఆధారాలు సేకరించి..న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చారు. ఇక అవినీతి రుజువు కావడంతోనే ఇప్పుడు బాబుకు కోర్టు శిక్ష వేసింది.

అయితే ఇది ప్రభుత్వ కక్ష అని కొందరు వాదిస్తున్నారు. ప్రభుత్వం కక్ష సాధించాలని అనుకుంటే జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే అరెస్టులు జరిగిపోయేవి. కానీ ఆధారాలతో సహ దొంగలని పట్టుకోవడానికి ఇంత సమయం పట్టింది. ఇప్పుడు న్యాయస్థానం ముందు మోసగాళ్ళు మోకరిల్లే పరిస్తితి వచ్చింది. ఇంకా ఎటు తప్పించుకోలేని పరిస్తితి ఉంది. ఇది తమని వంచించినందుకు తగిన శిక్ష అని యువత భావిస్తుంది. మొత్తానికి బాబు వస్తే జాబు అనేది పెద్ద మోసం…ఇప్పుడు కూడా అదే ప్రచారం..అందుకే ప్రజలకు ఈ దెబ్బతో నిజనిజాలు తెలిసాయని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version