ఏపీ రాజకీయాలు మరీ దారుణంగా తయారయ్యని చెప్పొచ్చు..నేతలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకోవడం మానేశారు..ఏకంగా తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వ్యక్తిగతంగా మాటల దాడి చేసుకోవడమే ఎక్కువైంది. అయితే ఈ మాటల దాడి మొదట ఎవరు మొదలుపెట్టారనేది ప్రజలకూ బాగా అవగాహన ఉంది..ఇప్పుడు అన్నీ పార్టీల నేతలు మాటల దాడితోనే రాజకీయం చేస్తున్నారు. ఆ మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్..వైసీపీ టార్గెట్గా ఎలా మాట్లాడారో తెలిసిందే. నా..ల్లారా రండి అంటూ..విరుచుపడ్డారు..చెప్పు చూపించి మరీ ఫైర్ అయ్యారు.
ఎప్పుడు ఓపికగా ఉండే పవన్ ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు..ఇక అసలు నలభై ఏళ్ల నుంచి మాటల దాడికి దిగని చంద్రబాబు సైతం..తాజాగా కర్నూలు పర్యటనలో విరుచుకుపడ్డారు..రండి రా..రండి చూసుకుందాం అంటూ వైసీపీ శ్రేణులపై ఫైర్ అయ్యారు. ఎలాంటి వారినైనా అయినా సరే చంద్రబాబు ‘ఏరా’ ‘రా’ అనడం జరగదు. కానీ బాబు కర్నూలు జిల్లాలో బరస్ట్ అయ్యారు. ఇక పవన్, బాబు వ్యాఖ్యలపై వైసీపీ ఏ రేంజ్లో కౌంటర్లు ఇస్తూ వస్తుందో చెప్పాల్సిన పని లేదు.
అయితే పవన్-బాబు బరితెగించి బూతులు మాట్లాడుతున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక వారి పని అయిపోయిందని జగన్పై గెలవలేక ఇలా తిడుతున్నారని కామెంట్ చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేకుండా లేదు..కాస్త ప్రతిపక్షంలో ఉండటం..జగన్పై ఆధిపత్యం చెలాయించాలనే క్రమంలో బాబు-పవన్ అదుపు తప్పినట్లే కనిపిస్తోంది.
కాకపోతే వారు బరితెగించారని వైసీపీ నేతలు మాట్లాడటమే పెద్ద వింత అని విశ్లేషకులు అంటున్నారు. అది ఎందుకో కూడా ప్రజలకు తెలుసని చెప్పొచ్చు..బూతులు మాట్లాడటం మొదలుపెట్టింది, వ్యక్తిగతంగా తిట్టడం, ఫ్యామిలీలని లాగి తిట్టడం ఎవరో చేశారో కూడా తెలుసు. అలాంటి వారు ఇప్పుడు బాబు-పవన్ బరితెగించారని చెప్పడం కాస్త కామెడిగా ఉందని చెప్పొచ్చు. బాబు-పవన్ బూతులు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు చెప్పడం..గురివింద గింజ నీతి చెప్పడమే అంటున్నారు. ఏదేమైనా గాని రాజకీయాల్లో ఎవరు మాట్లాడినా..ఇలాంటి బాష సమర్ధనీయం కాదు..మరి ప్రజలు ఎవరికి మద్ధతిస్తారో చూడాలి.