మరోసారి రెచ్చిపోయిన బాలకృష్ణ.. టీడీపీ కార్యకర్తపైనే దాడి

-

బాలకృష్ణ వింత వైఖరిపై టీడీపీ నేతలే మండిపడుతున్నారు. ఆయన ఇటీవలే ఓ మీడియా ప్రతినిధిని దూషించి.. ఆయన్ను ప్రాణాలు తీస్తా అంటూ అరిచారు.

అయ్యా బాలయ్య బాబు.. నీకు టీడీపీ కార్యకర్తలు ఎవరో తెలియట్లేదు.. ఇతర పార్టీల కార్యకర్తలెవరో కూడా తెలియట్లేదా? ఎవరి మీద పడితే వాళ్ల మీద నీ ప్రతాపం చూపిస్తే ఎట్లా బాలయ్యా? ప్రస్తుతం హిందూపురంలో బాలయ్య బాబును చూసి అందరూ అనుకునే మాటలు అవ్వేనట.

ఇటీవలే ఓ మీడియా జర్నలిస్టును అసభ్య పదజాలంతో దూషించిన బాలయ్య.. తాజాగా టీడీపీ కార్యకర్తపైనే చిందులు తొక్కారు. ఎన్నికల ప్రచారం కోసం ఆయన ఇవాళ హిందూపురం దగ్గర్లోని సిరివరం గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా బాలయ్యను కలిసిన టీడీపీ కార్యకర్త రవికుమార్.. తమ గ్రామ చెరువుకు నీటిని విడుదల చేయాలంటూ కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన బాలకృష్ణ.. రవికుమార్‌ను అక్కడి నుంచి తోసేశారు. అతడిని బయటికి పంపించాలంటూ పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు కూడా అతడిని అక్కడి నుంచి బయటికి పంపించేశారు. దీంతో మనస్తాపానికి గురైన రవికుమార్ వెంటనే టీడీపీకి రాజీనామా చేశారు. వేరే గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అభ్యర్థి ఇక్బాల్‌కు జరిగిందంతా చెప్పి.. ఆయన సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.


సొంత పార్టీ నేతలే మండిపాటు

బాలకృష్ణ వింత వైఖరిపై టీడీపీ నేతలే మండిపడుతున్నారు. ఆయన ఇటీవలే ఓ మీడియా ప్రతినిధిని దూషించి.. ఆయన్ను ప్రాణాలు తీస్తా అంటూ అరిచారు. బాలకృష్ణకు ఇలాంటి ఘటనలు చాలా సహజం. ఇది వరకు కూడా బాలయ్య టీడీపీ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. బాలయ్య వైఖరితో టీడీపీకి నష్టమే తప్ప లాభమేమీ ఉండదని వాళ్లు వాపోతున్నారు. ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదని వాళ్లు హైకమాండ్ ముందు వాపోతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version