గత వైఎస్సార్ సీపీ హయాంలో జగనన్న కాలనీల కోసం అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా ఆయన సభా వేదికగా మాట్లాడుతూ.. జగనన్న కాలనీలకు అప్పటి ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు చేయలేదని.. కేంద్రం డబ్బులతోనే కథ నడిపారని విమర్శించారు.
తాము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని, మీ హయాంలో మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారు.