కేసీఆర్‌ను పడగొట్టిన సామాన్య రైతు రేవంత్ రెడ్డి అని అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఉదయం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన ఆయన.. మీనాక్షి నటరాజన్ చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ నేతలకు ఎక్కడో తాకినట్లు ఉన్నాయని సెటైర్లు వేశారు.కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం మీనాక్షి నటరాజన్ కొనియాడారు. ప్రజల సొమ్మును బ్యాగులకు బ్యాగులు, కంటైనర్లకు కంటైనర్లు మీరు దోచుకుంటుంటే.. కాగ్ రిపోర్టే చాలా ఈ విషయాన్ని వెల్లడించిందని ఆరోపించారు.
కేసీఆర్‌ను ఓడించి ఫామ్‌హౌజ్‌లో కూర్చోబెట్టిన లీడర్ రేవంత్ అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఊక దంపుడు ఉపన్యాసాలు, వేల కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేసినా కేసీఆర్‌ను పడగొట్టాడని.. అది మీరు జీర్ణించుకోలేక రాజకీయ అక్కసుతో విమర్శలు చేస్తున్నారని అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు.