ఆరోపణ: గెలిచే సీటులో కేసీఆర్‌ కుటుంబం.. ఓడే సీటులో పీవీ కుటుంబం..

-

ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రంలో జరగే ఎన్నికల్లో ఏఏ స్థానాల్లో గెలుస్తారో అక్కడ తమ కుటంబ సభ్యులను బరిలోకి దించి.. ఓడిపోయే స్థానాల్లో ఇతరులను బరిలోకి దించుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవి ఓడిపోతారని తెలిసి కూడా ఆమెను బరిలోకి దించుతున్నారని బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ నేత కపిలవాయి దీలిప్‌ కుమార్‌ బీజేపీలో చేరిన సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. తెలంగాణలో దొరల పాలనను అడ్డుకునేలా ప్రజలు తీర్పు ఇవ్వాలనే ఆలోచనతో దీపిప్‌కుమార్‌ తన నామినేషన్‌ ఉపసంహరించుకొని బీజేపీలోకి చేరారని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారు..

కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని.. ఆ విషయాలన్నీ త్వరలోనే బయటకు తీస్తామని బండి సంజయ్‌ అన్నారు. లోక్‌సభ స్పీకర్‌ అనుమతి కోరానని.. అనుమతి వచ్చిన మరో క్షణమే కేసీఆర్‌ బండారం బట్టబయలు చేస్తానని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందించిస్తున్నారని.. వారంత ఏకతాటిపైకి రావాలన్నారు.

స్వార్థ రాజకీయం కోసం

తన స్వార్థ రాజకీయం కోసం పీవీ పేరును వాడుకుంటూ అందులో భాగంగానే వారి కుమార్తెనుకు ఎమ్మెల్సీ సీటు కేటాయించారని ఆరోపించారు. పీవీ కుటుంబంపై గౌరవం ఉంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ పీవీ ఘాట్‌ను కూల్చుతామని చెప్పినా కేసీఆర్‌ ఎందుకు మౌనం వహించారో తెలుపాలన్నారు. 2014లో పీవీ జయంతి సందర్భంగా తెలంగాణలో ఓ జిల్లాతో పాటు సాగునీటి ప్రాజెక్ట్‌కు పీవీ పేరు పెడతామని.. హైదరాబాద్‌లో విగ్రహం పెడతామని ఇప్పటి వరకు ఏ ఒక్కటి చేయలేదన్నారు. కేసీఆర్‌ను గద్దె దించాలంటే అది కేవలం బీజేపీలోనే సాధ్యమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version