ఇప్పుడు రాజకీయాలు హుజూరాబాద్‌కు చేరుకున్నాయి. మొన్నటి వరకు సెకండ్ గ్రేడ్ నాయకులతో హోరెత్తిన రాజకీయాలు ఇప్పుడు కీలక నేతల ఎంట్రీతో వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకుక టీఆర్ఎస్ మంత్రులతో హుజూరాబాద్ ఓ మోస్తరుగా రాజకీయాలు ఉంటే.. నిన్న బండి సంజయ్ పదాధికారుల మీటింగ్ రావడంతో ఒక్క సారిగా హీట్ పుట్టింది.
ఆయన రావడంతోనే అందరు కార్యకర్తలకు ఈటలకు అండగా ఉండేలా సమాయత్తం చేసే పనిలో పడ్డారు బండి సంజయ్. దీంతో ఇటు టీఆర్ ఎస్‌తో పాటు అటు బీజేపీలోను గేర్లు పడ్డాయి. అయితే బండిసంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు చేయడానికి కారణం చెప్పారు.
ఈటల రాజేందర్ ఎఫెక్ట్‌తోనే కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చాడని చెప్పారు. అంతేకాదు ఆయన అన్ని జిల్లాల పర్యటనకు వెళ్తున్నాడని దీనికి కూడా ఈటల రాజేందరే కారణమని వివరించారు బండిసంజయ్. అయితే ఆయన చెప్పిన మాటలతో ఈటలకు బాగా క్రేజ్ వచ్చేసింది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండి ఈటలను ఈ స్థాయిలో పొగడటంతో ఈటలకు ఇది కలిసొచ్చేలా ఉంది.