రాజధాని ప్రాంత ఆందోళనలకు వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు మద్దతు ప్రకటించారు. మంధడంలో రైతులు దీక్ష చేస్తున్న స్థలానికి వెళ్ళిన ఆయన తన మద్దతు ప్రకటించారు. రైతులతో ప్రభుత్వం చర్చలకు సిద్దమని ఆయన ప్రకటించారు. న్యాయం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే న్యాయం చేసే ప్రక్రియ మొదలుపెడతామని చెప్పారు.
అయితే అమరావతి ప్రాంత రైతుల కోసం ఇప్పటి వరకు ఎవరూ ముందుకి రాలేదు. ఈ తరుణంలో వైసీపీ ఎంపీ ముందుకివచ్చి వాళ్లకు సంఘీభావం ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆయన ఎవరి ఆదేశాలతో వెళ్ళారు…? ఆయన ఎందుకు వెళ్ళారు అనేది అర్ధం కాలేదు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్య చేసారు. ఇక్కడ భూములు ఇచ్చిన ఎవరికి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ కమిటీ వచ్చి మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటుందన్నారు. రైతుల కష్టాలు మాకు తెలుసన్న ఆయన… కమిటీ వచ్చినప్పుడు మీ అందరి అభిప్రాయాలు చెప్పండన్నారు. కమిటీ వచ్చినప్పుడు అభిప్రాయాలు చెప్పండి… మీరు దూరంగా ఉండవద్దని కోరారు. రైతులు అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండని సూచించగా అమరావతి ని కొనసాగిస్తూ మాతో చర్చకు రండి అని వైసీపీ ఎంపీకి రైతులు స్పష్టం చేసారు. రాజధానికి అనుకూలమా కాదా ముందు చెప్పాలి అని మందడంలో రైతులు నినాదాలు చేసారు.