కమలంలో ఊహించని చేరికలు..గ్రాఫ్ పెరుగుతుందా?

-

చాలా రోజుల తర్వాత కమలంలో ఊహించని చేరికలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీలోకి కీలక నేతలు చేరుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బి‌జే‌పిలో చేరిపోయారు. ఇక రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలుస్తుంది. అయితే ఈ చేరికలని బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు పట్టించుకోవడం లేదు.ఎలాగో బి‌ఆర్‌ఎస్ నేతలతో ఫుల్ గా ఉంది. ఇంకా ఓవర్ ఫ్లో అయింది.

అందులో కొందరు నేతలు బయటకెళితేనే బెనిఫిట్. ఇటు కాంగ్రెస్ లోకి కీలక నేతలు వస్తున్నారు. ఇక ప్రజా బలం లేని వారు వెళ్లిపోతే నష్టమేమీ లేదన్నట్లు ఉంది. అయితే బి‌జే‌పి మరింత దూకుడుగా ముందుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. బలమైన నేతలని చేర్చుకోవడానికి స్కెచ్ వేస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన ఇద్దరు బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలని బి‌జే‌పిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. అది కూడా బి‌ఆర్‌ఎస్ లో సీటు దక్కని వారినే టార్గెట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే వారితో టచ్ లో ఉన్నట్లు తెలిసింది.

అలాగే కాంగ్రెస్ లో బలంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలని సైతం బి‌జే‌పిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇప్పటికే కొందరు నేతలు బి‌జే‌పిలోకి రావడానికి సిద్ధమైనట్లు తెలిసింది. అయితే చేరికలు మరింత పెరిగితే బి‌జే‌పికి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే చాలా సీట్లలో బి‌జే‌పికి బలం లేదు. ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు వస్తేనే బి‌జే‌పికి బలం పెరుగుతుంది.

ఆ బలంతోనే ఎన్నికల బరిలో దిగి సత్తా చాటాలని చూస్తుంది. అయితే కిషన్ రెడ్డి ఇప్పుడు చేరికలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలిసింది. చూడాలి మరి ఈ చేరికలు బి‌జే‌పికి ఎంత ప్లస్ అవుతాయో.

Read more RELATED
Recommended to you

Exit mobile version