ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలన్న బలమైన ఉద్దేశ్యంతో అమరావతిని శాసన రాజధానిగా, కర్నూల్ ను న్యాయ రాజధానిగా మరియు విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారు. కానీ ప్రస్తుతానికి ఈ విషయంపై కోర్ట్ లో కేసులు నడుస్తున్నందున ఇంకా అధికారికంగా ఏవీ స్టార్ట్ కాలేదు. కాగా ఇప్పటికే సీఎం జగన్ అక్టోబర్ 24 నుండి విశాఖలోనే ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రుషికొండ సమీపంలో సీఎం అధికారిక భావన నిర్మాణం ఇప్పటికే పూర్తి అయింది. కేవలం ఇంటీరియర్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. అక్టోబర్ 24 సమయానికి రెడీ అవ్వచ్చని తెలుస్తోంది. కాగా ఈ రోజు భద్రత సిబ్బంది మరియు సీఎం ఆఫీస్ స్టాఫ్ భవనము మరియు పరిసరాలను చూడడానికి వెళుతున్నారు. సీఎం జగన్ ప్లాన్ ప్రకారం అక్టోబర్ 24 సమయానికి భవనంలోకి చేరుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
“అక్టోబర్ 24 నుండి విశాఖలోనే సీఎం జగన్” … రెడీ అవుతున్న సీఎం అధికారిక భవనం !
-