టార్గెట్ 60: 30ని డబుల్ చేయాల్సిందే!

-

తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ రోజురోజుకూ బలపడుతున్న విషయం తెలిసిందే..ఇంతకాలం తెలంగాణలో సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితమైన బీజేపీ…ఇప్పుడు డబుల్ డిజిట్ దక్కించుకోవడమే కాదు…ఏకంగా అధికారం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇప్పటివరకు బీజేపీకి ఎక్కువ సీట్లు రాలేదు…గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగైదు సీట్లు గెలుచుకునేది. ఇక గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది..కానీ ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుందో..అప్పటినుంచి తెలంగాణలో బీజేపీ సత్తా చాటడం మొదలుపెట్టింది. అధికారంలో టీఆర్ఎస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం…బీజేపీ అనే విధంగా ఎదిగింది…అనూహ్యంగా రెండు ఉపఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది. దీంతో బీజేపీ బలం 3కు పెరిగింది.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్తితులని చూస్తుంటే…బీజేపీ బలం ఇంకా పెరిగినట్లు కనబడుతోంది…ఇప్పుడున్న పరిస్తితుల్లో 3 నుంచి 30 సీట్లు వరకు గెలుచుకునే కెపాసిటీ బీజేపీకి వచ్చిందని తెలిసింది. బీజేపీ అంతర్గత సర్వేల్లో అదే విషయం తేలిందని తెలుస్తోంది. విజయ్ సంకల్ప్ సభ తర్వాత…అమిత్ షా…మరికొందరు కీలక నేతలు…రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమై ఇదే విషయం చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో “మనం 30 సీట్లకు మించి గెలుచుకోలేమని, మన బలం ఇంకా పెంచుకోవల్ని, 119 నియోజకవర్గాల్లో బలం పెంచుకునే దిశగా పనిచేయాలి” అని ఓ కీలక నేత…రాష్ట్ర నేతలకు వివరించినట్లు తెలిసింది.

అంటే ఇప్పుడున్న పరిస్తితుల్లో బీజేపీకి 30 సీట్లు గెలుచుకునే బలం ఉందని తెలుస్తోంది…ఇంకా 30 సీట్లు గెలుచుకునే బలం పెంచుకోవాల్సి ఉంది..మొత్తం 60 సీట్లు గెలుచుకుంటేనే తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కుతుంది. ఇప్పుడు ఆ దిశగానే బీజేపీ నేతలు పనిచేస్తున్నారు…వీక్ గా ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలని చేర్చుకోవడం, 119 నియోజకవర్గాల్లోనూ తిరుగుతూ…గ్రామ స్థాయిలో ఓటర్లని ఆకట్టుకునే కార్యక్రమాలు చేయాలి..అప్పుడే ఎన్నికలనాటికి బీజేపీ బలం ఇంకా పెరుగుతుంది..టార్గెట్ 60 కూడా రీచ్ అయ్యి అధికారం దక్కించుకోగలరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version