గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్న టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ – అతియా శెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో మూడు నెలల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. ఈ క్రమంలో అతియా కుటుంబాన్ని కలిసేందుకు రాహుల్ కుటుంబ సభ్యులు ఇటీవలే ముంబై వచ్చారని తెలుస్తోంది. రాహుల్- అతియాలు వారి కుటుంబ సభ్యులతో కలిసి త్వరలో వారు ఉండబోయే కొత్త ఇంటిని సందర్శించారని, వారి పెళ్లి రెండు కుటుంబాలకు గొప్ప వేడుక అవుతుందని అతియా సన్నిహితులు తెలిపారు.
పెళ్లికి సంబంధించిన అన్నింటినీ అతియానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే గాయంతో ఇంగ్లాండ్ పర్యటనకు దూరమైన కె.ఎల్.రాహుల్ చికిత్సకోసం జర్మనీ వెళ్లగా.. వెంట అతియా కూడా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాహుల్ కోలుకునేందుకు నెల రోజులు పడుతుందని, అప్పటి వరకు అతియా అక్కడే ఉంటుందని సమాచారం.