కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై దేశ వ్యాప్తంగా మొదలైన రగడ.. నేరుగా ప్రధానే రంగంలోకి..

-

గ్యారెంటీలపై కాంగ్రెస్, బిజేపీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.. కాంగ్రెస్ హామీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోడీ అంటుంటే.. బిజేపీనేతల మాటలను నమ్మొద్దంటోంది కాంగ్రెస్ పార్టీ.. మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల వేళ.. గ్యారెంటీల మద్య పొలిటికల్ చర్చలు నడుస్తున్నాయి.. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఇంతకీ కాంగ్రెస్ ఏయే రాష్టాల్లో ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది.. ఇప్పుడు అక్కడ పరిస్తితి ఏంటో చూద్దాం..

కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ కు అధికారాన్ని తెచ్చిపెట్టాయి.. మహారాష్టలో కూడా అదే ఫార్ములాను ప్రయోగించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది.. అయితే ప్రధాని మోడీ ఆరు గ్యారెంటీల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. యే రాష్టంలో కూడా హామీలను అమలు చెయ్యడం లేదంటూ.. విమర్శించారు.. దీనిపై కొత్త రచ్చ మొదలైంది.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలన్నీ ఫేక్ అనే ప్రచారం జరుగుతోంది..

కర్ణాటక, తెలంగాణలో ఆరు గ్యారంటీలంటూ ప్రజల వద్దకు వెళ్లింది కాంగ్రెస్. ప్రజలు కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మారు. హస్తం గుర్తుపైనే ఓటు వేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సక్రమంగా కేటాయించకపోవడంతో కొన్ని విమర్శలు తలెత్తుతున్నాయి. ఇష్టమొచ్చినట్లు ఫ్రీ అంటూ వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ యా రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేయకపోవడం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తెలంగాణాలోనూ అదే పరస్థితి కనిపిస్తోంది..

కర్ణాటక, తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం హామీ ఇచ్చింది.. తెలంగాణాలో దాన్ని అమలు చేస్తున్నా.. కర్ణాటకలో మాత్రం అది ఇంకా ఆచరణకు సాధ్యం కాలేదు.. తెలంగాణాలో కూడా అనేక ఇబ్బందులు నడుమ ఈ హామీ అమలవుతోంది.. ఇలాంటి హామీలు ఇవ్వడం వల్ల అభివృద్ది కుంటుపడుతోందని బిజేపీతో పాటు.. ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నారు.. ఈ రెండు రాష్టాల్లో పరిస్తితిని గమనించిన ప్రధాని మోడీ.. ఆరుగ్యారెంటీలే టార్గెట్ గా విమర్శలు సంధిస్తున్నారు.. దీనిపై కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది..

మహారాష్ట్ర ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పై కాంగ్రెస్ ఆలోచనలో పడిందట.. బడ్జెట్ ను బట్టి హామీలిస్తామని జాతీయ అద్యక్షులు ఖర్గే చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.. మరో పక్క రాహుల్ గాంధీ కూడా ఉచిత హామీలను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. వాస్తవాలను ప్రజలకు చెప్పి.. తద్వారా హామీలిస్తే.. ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నారట.. ఇలాంటి హామీలిచ్చి.. అమలు కాకపోతే.. ప్రతిపక్షాలకు టార్గెట్ గా మారుతామని ఆయన ముఖ్యనేతలతో అన్నారట.. మొత్తంగా గ్యారెంటీలపై కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గినట్లే ఉంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version