ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విపక్ష తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆ పార్టీని వీడటానికి ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సిద్దమయ్యారని అంటున్నారు. విజయవాడ ఎంపీ కేసినేని నానీ కొన్ని రోజులుగా ప్రభుత్వం పై టీడీపీ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అదే విధంగా పౌరసత్వ సవరణ చట్టం విషయంలో అయన వ్యవహారశైలి ఇబ్బందిగా మారిందని ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దీనితో చంద్రబాబు ఎంపీ గారిని పిలిచి వైఖరి మార్చుకోవాలని స్పష్టం చేయగా విజయవాడలో ముస్లిం ల సంఖ్య ఎక్కువగా ఉందని తనకు వాళ్ళు భారీగా పశ్చిమ నియోజకవర్గంలో ఓట్లు వేసారని చెప్పినట్టు సమాచారం. ఇక ఎమ్మెల్యేలు ముగ్గురు పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. వెలగపూడి రామకృష్ణ, వాసుపల్లి గణేష్ రాజీనామా చేయడానికి సిద్దమయ్యారని అంటున్నారు.
ఇక విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే సీనియర్ నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావు కూడా పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. త్వరలోనే వీళ్ళు రాజీనామా లేఖను సమర్పించాలని భావిస్తున్నారు. ఇప్పుడు వీరితో చర్చలు జరపడానికి పార్టీ సీనియర్ నేతలు రంగంలోకి దిగారని, అయినా సరే వాళ్ళు మాత్రం తమ ఆలోచనను మార్చుకునే అవకాశం లేదని అంటున్నట్టు తెలుస్తుంది.