బలమైన నేత కోసం బీఆర్ఎస్ క్యాడర్ ఎదురుచూపులు.. ఏ నియోజకవర్గమంటే..?

-

ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉంది. సరైన నాయకుడ్ని నియమిస్తే సత్తా చాటతామని చెబుతోంది.. కానీ బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం వేచిచూసే ధోరణిలో ఉంది.. సరైన టైమ్ లో సరైన నాయకుడ్ని బరిలోకి దింపుతామని చెబుతోంది.. కానీ ఇంతవరకు ఆదిశగా అడుగులు వెయ్యకపోవడంతో.. క్యాడర్ లో నిరాశ పెరుగుతోంది.. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి అంటే..?

హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కారు లేని డ్రైవర్ గా మారింది.. క్యాడర్ ఉన్నా.. నడిపించే నాయకుడు లేకపోవడంతో నిరాశలో ఉంది.. సరైన నాయకుడు దొరికితే తమ సత్తా చూపుతామని క్యాడర్ చెబుతోంది.. కానీ బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఈ నియోజకవర్గాన్ని లైట్ తీసుకుంటోంది.. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనే నేత కోసం ఎదురుచూస్తున్నామని చెబుతోంది..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కారు దిగి కమలం గూటికి చేరిపోయారు.. అప్పటి నుంచి క్యాడర్ కు నాయకుడులేదు.. 2018 అసెంబ్టీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన సైది రెడ్డి ఓడిపోగా.. 2019లో అనుహ్యంగా వచ్చిన ఉప ఎన్నికల్లో గెలిచి.. తొలిసారి బీఆర్ఎస్ జెండా ఎగరేశారు.. గెలిచిన క్షణం నుంచే ఆయన బలం పుంజుకున్నారు.. పార్టీని కూడా బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. ఇక తనకు తిరుగులేదని భావిస్తున్న సమయంలో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి..

2023 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.. ఆ తర్వాత జరిగిన రాజకీయా పరిణామాల నేపథ్యంలో..ఉత్తమ్ మంత్రి అయ్యారు.. దీంతో సైదిరెడ్డి సైలెంట్ గా సైడయ్యారు.. కమలం గూటికి చేరిపోయారు.. ఆయన పార్టీ మారడంతో బీఆర్ఎస్ లో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది.. పార్టీని నడిపే నాయకుడే లేకుండా పోయాడు.. నాయకుడు వెళ్లిపోయినా.. తమంతా పార్టీతోనే ఉన్నామని క్యాడర్ చెబుతోంది.. నడిపించే నాయకుడుంటే కాంగ్రెస్ ను ,బిజేపీని బలంగా ఎదుర్కొంటామని పార్టీ పెద్దలకు కూడా చెప్పారట..

కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి దూకుడుమీదున్నారు.. ఈ సమయంలో ఇన్చార్జిని నియమించకపోవడమే మంచిదన్న భావనలో బీఆర్ఎస్ ఉందట.. సరైన సమయంలో బలమైన నేతను బరిలోకి దింపేందుకు స్కెచ్ వేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.. 2009లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసిన జగదీశ్వర్ రెడ్డి ఇక్కడి బాధ్యతలు తీసుకోవాలని ద్వితీయ శ్రేణి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version