ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ పనితీరు భేష్ : కేంద్ర మంత్రి బండి సంజయ్

-

భారతదేశంలో ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా నిందితులను పట్టుకునేందుకు దోహదపడే వ్యవస్థ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడం అభినందనీయమని, పని తీరు బాగుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హత్యలు, అత్యాచారాలు దొంగ తనాలతో పాటు నార్కొటిక్, సైబర్, మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడిన దోషులను పట్టుకునేందుకు దోహదపడేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో సీఎఫ్ఎస్ఎల్ సంస్థను తీర్చిదిద్దిందని పేర్కొన్నారు.

ఇవాళ హైదరాబాద్ రామంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ, సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ సంస్థలను కేంద్ర మంత్రి సందర్శించారు. ఆయా సంస్థలలోని ప్రతీ విభాగానికి వెళ్లి పరిశీలించారు. అధికారులతో సమావేశమై ఆయా విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. దక్షిణ భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలు హైదరాబాద్ లో ఉండటం గర్వకారణం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version