‘కారు’కు ఇంటిలిజెన్స్ షాక్..37 సీట్లలో నో ఛాన్స్.?

-

వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారంలోకి రావాలని అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ-కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టి మళ్ళీ అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలితే తమకే లాభమని లెక్కలు వేస్తుంది. అయితే ఈ సారి కారు పార్టీకి గెలుపు అనేది అనుకున్నంత ఈజీ కాదని తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. అటు చాలా స్థానాల్లో ఆధిపత్య పోరు తారస్థాయిలో కనిపిస్తోంది. గత ఎన్నికల మాదిరిగా ఈ సారి సెంటిమెంట్ తో నెగ్గుకురావడానికి అవకాశాలు లేవు. కే‌సి‌ఆర్ గాలి అనుకున్న మేర లేదు. ఏదో ప్రతిపక్షాలు బలంగా లేకపోవడమే బి‌ఆర్‌ఎస్ పార్టీకి అడ్వాంటేజ్. అవి గాని పుంజుకుంటే అంతే సంగతులు. అయితే ఇటీవల వస్తున్న ఇంటిలిజెన్స్ రిపోర్టు ప్రకారం…బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఈ సారి గట్టి షాక్ తగులుతుందని తెలిసింది.

ఆ పార్టీ ఈ సారి 37 స్థానాల్లో గెలవడం మాత్రం కష్టమని ఇంటిలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయట. 119లో ఎం‌ఐ‌ఎం 7 స్థానాలు పక్కన పెడితే..112 సీట్లలో బి‌ఆర్‌ఎస్ 37 స్థానాలు గెలవడం కష్టమని చెబుతున్నాయి. అలాగే 26 సీట్లలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఫిఫ్టీ-ఫిఫ్టీ గానే గెలిచే అవకాశాలు ఉన్నాయట. 32 స్థానాల్లో కాస్త లీడ్ లో కనిపిస్తుందట. మిగిలిన స్థానాల్లో పక్కా గెలుపు అవకాశం ఉందట.

అయితే ప్రతిపక్షాలు వీక్ గా ఉండటం బి‌ఆర్‌ఎస్ పార్టీకి పెద్ద అడ్వాంటేజ్. అందులో కాంగ్రెస్ పార్టీ గాని పుంజుకుంటే బి‌ఆర్‌ఎస్ పార్టీకి భారీ దెబ్బ అని అంచనా వేస్తున్నారు. అటు టి‌డి‌పి సైతం కొన్ని స్థానాల్లో పుంజుకున్న కారుకే డ్యామేజ్. మొత్తానికి ఎటు చూసిన బి‌ఆర్‌ఎస్ పార్టీకి అనుకూల పరిస్తితులు తక్కువ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version