చిట్టి చేతులు రేపటిని నడిపిస్తాయి
చిన్న చిన్న పనులు రేపటిని నిర్దేశిస్తాయి
రూపాయి పాపాయి అవును ఈ రెండూ ఒక్కటే
భవిష్య కాలంలో ఎదిగివచ్చే తీరునకు ఇప్పటి
పెట్టుబడి ఇప్పటి నడవడి అన్నవి కీలకం
ఇవాళ బడ్జెట్ డే రూపాయి లెక్కల దినోత్సవం అని తెలుగులో రాసుకోవచ్చు. ఏం కాదు కానీ ఆ లెక్కల ఉండే వెనుకబాటుతనాన్ని మనం నిలువరించగలిగినప్పుడే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అన్నది సాధ్యం.అన్ని వర్గాల సమున్నత అభివృద్ధి అన్నది సాధ్యం. ఆ విధంగా ఇవాళ తెలుగింటి కోడలు ఏ విధంగా కరుణించగలరో చూడాలి. ఏ విధంగా ఆదుకుని సహాయ పడగలరో కూడా అంచనా వేయగలగాలి.
ఆంధ్రా కన్నాతెలంగాణ కాస్త బెటర్. తెలంగాణ అన్న రాష్ట్రం తనని తాను జాతీయ వృద్ధి రేటుతో పోల్చుకుంటుంది. ఆ పనిలో వేగం పెంచుతూ పోతుంటుంది. ఆంధ్ర ప్రభుత్వం కేవలం తనకి తాను పరిమితం అయి ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే దేశంతో పోటీ పడే రాష్ట్రాలో సంబంధిత ప్రభుత్వాల్లో దేశంలో చాలా ఉన్నాయి. ఆ పాటి పోటీ ఇవ్వకుంటే డబ్బున్న కారణంగా బీజేపీ మిగతా ప్రాంతీయ పార్టీలను బతకనివ్వదు. నాలుగు వేలకోట్లకు పైగా ఆస్తులున్న బీజేపీ ఎక్కడ ? 300 కోట్ల రూపాయల ఆస్తులున్న టీఆర్ఎస్ ఎక్కడ? అయినా ఈ సంపద అన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్నది డౌట్.ఆ విధంగా ప్రాంతం నుంచి ప్రాంతం వరకూ డబ్బు ఏ రూపాన మారుతుంది దేశం నుంచి దేశం వరకూ డబ్బు ఏ విధంగా తరలి పోతుంది అన్నదే ఇవాళ ముఖ్యం.
వాస్తవానికి నగరాలే సంపద సృష్గి కేంద్రాలు అన్న అపోహ ఉంది కానీ గ్రామీణ భారతావని ఎంత పటిష్టంగా ఉంటే అంత వేగంగా దేశం పురోగతి సాధ్యం. ఆ విధంగా సంపదను పెంచుకోవడంలో చూపాల్సిన శ్రద్ధ పాలకులు చేయాలి. నియంత్రిత వ్యవస్థ ఉంటూనే ఖర్చువిషయమై స్పష్టమయిన వివరం ఒకటి పాలకులు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. ఆ విధంగా దేశాన్ని పాలించే శక్తులు రూపాయి లెక్కలపై జాగురుకత వహించాలి.వ్యవహరించాలి. కాలంలో వచ్చే వేగంతో పాటు ఖర్చు అన్నవి ఏ నిష్పత్తిలో ఉన్నవి అన్నవి కూడా అంచనా వేయగలగాలి.వస్తున్న సవాళ్లను స్వీకరిస్తూ చేసే ప్రతి పని రేపటి పురోగతికి మేలు చేస్తే చాలు.