డ్ర‌మ్ములో రాళ్లేసే వాడి గురించి మాట్లాడ‌ను.. కేటీఆర్ వ్యాఖ్య‌ల‌కు బండి కౌంట‌ర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గురు వారం క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌టించిన విషయం తెలిసిందే. కాగ ఈ పర్య‌ట‌న‌లో క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. డ‌బ్బాలో రాళ్లు వేసి అటు ఇటు ఊపిన‌ట్టు బండి సంజ‌య్ మాట్లాడుతార‌ని విమ‌ర్శించారు. కాగ తాజా గా ఈ వ్యాఖ్య‌ల‌పై క‌రీంనగ‌ర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ స్పందించారు. డ్ర‌మ్ములో రాళ్లేసే వాడి గురించి తాను మాట్లాడ‌న‌ని మంత్రి కేటీఆర్ ను ఉద్ధేశించి అన్నారు. త‌న‌పై వాడు వీడు ఎదో మాట్లాడితే.. ఆరోప‌ణ‌లు చేస్తే.. ప‌ట్టించుకోన‌ని అన్నారు.

అహంకారంతో పరిపాల‌న చేసినా.. మాట్లాడినా.. ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌ని అన్నారు. కాగ ప్ర‌స్తుతం కాలంలో హిందూ ధ‌ర్మం గురించి హేళ‌న చేస్తు మాట్లాడటం ఫ్యాషన్ అయింద‌ని మండి ప‌డ్డారు. అలాంటి వారికి ప్ర‌జ‌లే త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని అన్నారు. కాగ గురువారం మంత్రి కేటీఆర్ క‌రీంన‌గ‌ర్ లో ఎంపీ బండి సంజ‌య్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

క‌రీంన‌గ‌ర్ కు ఎంపీ ఎన్నిక అయి మూడు సంవ‌త్స‌రాలు అవుతున్నా.. రూ. మూడు కోట్ల నిధులు అయినా తీసుకురాలేడ‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. ట్రిపుల్ ఐటీ, మెడిక‌ల్ కాలేజీ, కాళేశ్వ‌రానికి జాతీయ హోదా కోసం త‌మ పార్టీ కోట్లాడుతుంద‌ని కేటీఆర్ అన్నారు. వీటి గురించి బండి సంజ‌య్ ఒక్క సారి అయినా.. పార్ల‌మెంట్ లో మాట్లాడారా అని ప్ర‌శ్నించారు.