బెంగాల్ లో త్రుణమూల్ హవా… పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో విజయం దిశగా టీఎంసీ

-

ఉపఎన్నికల్లో బీజేపీ పత్తా లేకుండా పోయింది. ఇటీవల దేశవ్యాప్తంగా ఒక పార్లమెంట్, నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అన్ని స్థానాల్లో కూడా బీజేపీ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా బెంగాల్ లోని అసన్ సోల్ పార్లమెంట్ తో పాటు బల్లీగంజ్ అసెంబ్లీ స్థానంలో త్రుణమూల్ హవా నడిస్తోంది. విజయం దిశగా టీెఎంసీ దూసుకెళ్తోంది. అసన్ సోల్ నుంచి టీఎంసీ తరుపున శత్రుఘ్నుసిన్హా, బల్లీ గంజ్ నుంచి బాబుల్ సుప్రియో విజయం దిశగా వెళ్తున్నారు. బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. 

ఇదిలా ఉంటే బీహార్ బోచాహాన్ అసెంబ్లీ స్థానంలో ఆర్జేడీ పార్టీ విజయం సాధించింది. అధికార నితిష్ కుమార్, బీజేపీ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తాకింది. చత్తీస్ గఢ్ రాష్ట్రం ఖైరాగఢ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి యశోద నియాంబర్ వర్మ ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ నార్త్ లో కాంగ్రెస్ అభ్యర్థి జాదవ్ జయశ్రీ చంద్రకాంత్ ముందంజలో ఉన్నారు. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో రెండింటిలో 2 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం దిశగా వెళ్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version