బైరెడ్డి సీటుపై ట్విస్ట్..జగన్ సెట్ చేస్తారా?

-

ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియాలో బాగా క్రేజ్ ఉన్న నాయకుల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒకరు. సోషల్ మీడియాలో ఈయనకు బాగా ఫాలోయింగ్ ఉంది. దీంతో వైసీపీ యువతలో బైరెడ్డికి క్రేజ్ ఎక్కువ. అలా యూత్ లో క్రేజ్ ఉన్న బైరెడ్డికి నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వాలనే డిమాండ్ వైసీపీ యువ శ్రేణుల నుంచి వస్తుంది. నామినేటెడ్ పదవులు ఇస్తేనే..తనదైన శైలిలో దూకుడుగా ఉంటున్న బైరెడ్డి..ఇంకా ఎమ్మెల్యే, ఎంపీ అయితే ఇంకా దూకుడుగా ఉంటారని అంటున్నారు.

ఈ క్రమంలో ఆయనకు నెక్స్ట్ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ప్రస్తుతం బైరెడ్డి నందికొట్కూరు ఇంచార్జ్ గా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదట నుంచి నందికొట్కూరులో బైరెడ్డి ఫ్యామిలీకి పట్టు ఎక్కువ. ఇక అది ఎస్సీ స్థానం అయ్యాక సీన్ మారింది. ఎస్సీ సీటుగా మారిన అక్కడ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హవా ఉంది. ఆయన ఎవరికి సపోర్ట్ ఇస్తే…వారే గెలుస్తారనే పరిస్తితి.

byreddy siddharth reddy

ఇక ఎస్సీ సీటు కావడం వల్ల..బైరెడ్డికి నందికొట్కూరులో పోటీ చేయడం ఎలాగో కుదరదు. దీంతో కర్నూలులో ఏదొక సీటు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ కర్నూలులో ఒక్క సీటు కూడా ఖాళీ లేదు. అన్నీ చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకపోతే బైరెడ్డికి అడ్వాంటేజ్ ఏంటంటే..వచ్చే ఎన్నికల్లో జగన్ పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని చెప్పారు. దీంతో కర్నూలులో కొంతమంది ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే విషయంలో డౌట్ ఉంది.

ఈ క్రమంలో ఏదైనా ఒక సీటు బైరెడ్డికి ఇవ్వవచ్చని ప్రచారం ఉంది. ఒకవేళ ఎంపీ సీటు ఇచ్చిన ఇబ్బంది లేదని అంటున్నారు. బైరెడ్డి లాంటి వారికి సీటు ఇస్తే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉందని వైసీపీ యూత్ అంటుంది. చూడాలి మరి బైరెడ్డికి జగన్ సీటు ఇస్తారో లేదో

Read more RELATED
Recommended to you

Exit mobile version