ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదు – తెలంగాణ మంత్రి

-

ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.కేసీఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారమని.. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. అక్కడ ప్రభుత్వాల వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెర మీదకు వచ్చిందని.. ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదని తెల్చి చెప్పారు.

తెలంగాణలో కలపాలని తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కోరడం కేసీఆర్ అభివృద్ధికి నిదర్శనం అని.. తెలంగాణ బంగారు తెలంగాణగా మారినట్టే సువర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమని కేసిఆర్ గతంలోనే చెప్పారన్నారు. పరిపాలకుల చిత్తుశుద్ధి లోపంతో ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయి.. పరిపాలకులను మార్చండి సువర్ణాంధ్ర గా మార్చుకోండని కోరారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.. వెనుకబాటుకు కారణమైన పారిపాలకుల మీద ఆంధ్ర ప్రజలు తిరుగుబాటు చేయాలని తెలిపారు. అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా ఆంధ్ర ప్రజలు నాయకులు ఆలోచించాలన్నారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version