ఏపీలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా తయావుతోంది. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా ఇప్పుడు టీడీపీని గట్టెక్కించే పనిలో లేకుండా పోయారు. నేతలు ఎంత సేపు తమ సొంత వ్యవహారాల కోసమే అన్నట్టు తయారయ్యారు. దీంతో పార్టీని కాపాడేందుకు ఒక్కరు కూడా ముందుకు రావట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో తలనొప్పి వస్తోంది చంద్రబాబుకు అదేంటంటే దాదాపు ఇప్పుడు 40 నియోజకవర్గాల్లో టీడీపలో ఉండే వృద్ధ నేతలు ఎక్కువగా పెత్తనాలు చెలాయిస్తున్నారు.
వారిని కాదని ఏ పని కూడా చేయనివ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్కు చెప్పాలంటే అరకులో కిశోర్ చంద్రదేవ్, అలాగే పార్వతీపురంలో శతృచర్ల విజయరామరాజు లాంటి వారు పాతుకుపోయారు. వీరే కాదు ఇలా అనేక మంది వృద్ధ నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ఏలుతున్నారు. కాగా వీరంతా ఒకప్పుడు ప్రజల్లో ఒక వెలుగు వెలిగిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే చెప్పాలి.
దీంతో ఇప్పుడు వీరంతా కూడా ప్రభుత్వంపై ఏదైనా విషయంలో ఉద్యమిద్దాం రమ్మంటే అస్సలు ముందుకు రావట్లేదు. పారటీని అడ్డు పెట్టుకుని సొంత పనులు చేసుకుంటున్నారు గానీ సొంతగా ఐడియాలైనా ఇస్తున్నారా? అంటే అది కూడా లేదనే తెలుస్తోంది. అంతే కాదండోయ్ వీరికి వచ్చే ఎన్నికల్లోనూ టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ కారణగా ఆ ఏరియాల్లో వేరే నేతలను ఎదగనివ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఇదే విషయంపై చంద్రబాబు కూడా వారిని తప్పిస్తేనే పార్టీలో దూకుడు పెరుగుతుందని భావిస్తున్నారంట.