ఏపీ రాజకీయాల్లో రికార్డులు అంటే 1994లో ఎన్టీఆర్, 2004లో వైఎస్సార్ క్రియేట్ చేసినవి. ప్రత్యర్ధి పార్టీలని చిత్తుగా ఓడించి..దాదాపు 80 శాతం వరకు సీట్లు గెలుచుకోవడం..ఇక అలాంటి గెలుపే 2019 ఎన్నికల్లో జగన్‌కు వచ్చింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి 175 సీట్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో 175కి వైసీపీ 151 సీట్లు గెలుచుకుంది. అంటే 80 శాతం పైనే సీట్లు వైసీపీ గెలుచుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.
టిడిపి సైతం చరిత్రలో ఎప్పుడూలేని విధంగా 23 సీట్లకు పరిమితం కావడం కూడా ఒక రికార్డు అని చెప్పవచ్చు. అయితే ఈ రికార్డుని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఉండే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు సరికొత్త రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. అది కూడా చంద్రబాబు-పవన్ కలిస్తే జగన్ రికార్డుని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని తాజా రిపోర్టుల్లో తేలిందట. అంటే టిడిపి-జనసేన కలిస్తే గత ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్న 151 సీట్లని దాటే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే మళ్ళీ అలాంటి విజయం సాధించడం అనేది కాస్త కష్టమే. మళ్ళీ ఆ రేంజ్ లో ప్రజా గాలి ఒక వైపు ఉంటుందనేది చెప్పలేం. ఎంత బాబు, పవన్ కలిసి పోటీ చేసినా సరే ఆ స్థాయిలో విజయం అంది కాస్త కష్టమే.
ఇక ఎలాగో ఆ రికార్డుని మళ్ళీ జగన్ బ్రేక్ చేయడం కష్టమే..మళ్ళీ ఆయన గెలుపుపై కూడా డౌట్లు ఉన్నాయి. కానీ ఎలాగోలా మళ్ళీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్నారు. ఇక జగన్ కు చెక్ పెట్టాలని బాబు చూస్తున్నారు. ఇదే సమయంలో పవన్ ని కలుపుకుని వెళితే జగన్‌ని ఓడించవచ్చు అనేది బాబు ప్లాన్. పవన్ సైతం ఆ దిశగానే ఆలోచన చేస్తున్నారు. చూడాలి మరి బాబు, పవన్ కలిసి జగన్ రికార్డుని బ్రేక్ చేస్తారో లేదో.