అమ‌రావ‌తిపై బాబు మార్క్ ‘ రియ‌ల్ ‘ డైలాగులు…!

-

పిచ్చి ముదిరింది.. రోక‌లిని త‌ల‌కు చుట్టండి- అన్నాడ‌ట వెన‌క్కి ఒక‌డు. ఇప్పుడు అచ్చు అలాగే ఉన్నాయి కొంద‌రి ప‌లుకులు. రాష్ట్రంలో రాజ‌ధాని నిర్మాణానికి డ‌బ్బులు లేవు మ‌హాప్ర‌భో.. అంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌ల ప‌ట్టుకుంటోంది. పైగా ల‌క్ష కోట్లు పెట్టి క‌ట్టినా.. ఇప్ప‌ట్లో ఏపీ రాజ‌ధాని రూపు రేఖ‌లు ఏర్ప‌డే ప‌రిస్థితి లేద‌ని చెబుతోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అభివృద్ది చెందిన విశాఖ‌లో పాల‌నా రాజ‌ధాని ఏర్పాటు చేయ డం ద్వారా రాష్ట్రంలో స‌మ‌గ్రాభివృద్ది చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చెబుతోం ది.

అయితే, చంద్ర‌బాబు అండ్ కోలు మాత్రం.. రాజ‌ధాని నిర్మాణాని ఇప్ప‌టికిప్పుడు 3 వేల కోట్లు ఉంటే చా లు.. మిగ‌తాది.. మ‌రికొన్నాళ్లు ఆగాక చూసుకోవ‌చ్చు.. అని సెలవిస్తున్నారు. అదేస‌మ‌యంలో రాజ‌ధాని లో భారీ భూ బ్యాంకు ఉంది.. వ‌చ్చే రోజుల్లో ఎక‌రా భూమిని రూ.20 కోట్ల‌కు అమ్ముకుని రాజ‌ధాని అవ‌స‌రాల‌కు వినియోగించుకోవ‌చ్చు.. అని బాబు చెబుతున్నారు. అంటే.,. రాష్ట్ర ప్ర‌భుత్వం ఫ‌క్తు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపా రం చేయ‌డ‌మేన‌న్న‌మాట‌. దీనిపై ప్ర‌భుత్వం నుంచి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వాలు న్న‌ది రియ‌ల్ వ్యాపారాల కోస‌మా? అంటూ మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.

అయితే, ఇప్పుడు ఓ వ‌ర్గం మీడియాలో ప్ర‌భుత్వాలు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే త‌ప్పులేద‌ని అంటూ.. స‌రికొత్త ప‌లుకుల‌కు శ్రీకారం చుట్టారు. దీనికి ఉదాహ‌ర‌ణ‌ల‌ను కూడా జోడించారు. హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటుచేసిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ప్రభుత్వ అధీనంలోని భూములను లే అవుట్లుగా అభివృద్ధి చేసి వేలం ద్వారా విక్రయించారు.

అలా వచ్చిన డబ్బుతో హైదరాబాద్‌లో రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు ఫ్లైఓవర్లను నిర్మించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన రాజశేఖర్‌రెడ్డి ఆ మోడల్‌నే కొనసాగించారు. ప్రభుత్వ భూములను విక్రయించి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని భూములనే పెట్టుబడిగా వాడారు. ప్రభుత్వ భూముల వేలాన్ని అప్పట్లో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్‌ తప్పుబట్టారు.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ప్రభుత్వ భూములను వేలం వేయడం ద్వారా నగరాభివృద్ధికి నిధులను సమకూర్చుకుంటున్నారు.. అని చేసిన ప‌లుకుల‌ను కేంద్రం క‌నుక వింటే.. ఇక‌, రాష్ట్రానికి పైసా కూడా అవ‌స‌రం లేద‌ని, ఉన్న భూముల్ని తాక‌ట్టు పెట్టో.. అమ్ముకునో.. అభివృద్ధి చేసుకుంటుంద‌ని తీర్మానం చేస్తే.. ప‌రిస్థితి ఏంటి ? అనేది మేథావుల మాట‌. మ‌రి వీటికి స‌మాధానం ఏం చెబుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version