ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో అమరావతి ప్రాంతంలో ఎలాంటి ఆందోళనలు లేకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో రైతులు మళ్ళీ రోడ్డు ఎక్కారు రైతులు. నిన్నటి వరకు ప్రైవేట్ ప్రదేశాల్లో నిరసన తెలిపిన రైతులు, ఇప్పుడు ఉన్నపళంగా మందడంలో రోడ్డు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. భారీగా రోడ్ల మీదకు వచ్చారు.
చలో అసెంబ్లీ, జైలు భరో వంటి కార్యక్రమాలకు రైతులు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో అమరావతి రైతులకు పోలీసులు ముందే వార్నింగ్ ఇస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల రోజు నిరసనలకు అనుమతి లేదని, రైతులకు కొందరు కీలక నేతలకు ముందే నోటీసులు ఇచ్చారు. ఎక్కడా కూడా రైతులు ఆ రోజు బయటకు వచ్చి నిరసనలు చేయవద్దని హెచ్చరికలు జారి చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక సోమవారం బిఎసి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి అనే దాని మీద చర్చ జరగనుంది. ఇక అసెంబ్లీ సమావేశాలను జరగనీయమని రైతులు చెప్పడం విశేషం. దీనితో సోమవారం అమరావాతిలో ఎం జరుగుతుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అటు తెలుగుదేశం పార్టీ సమావేశాలకు వెళ్తుందా లేదా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.