తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని విజయవాడలో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం అర్థమవుతుంది. కేసినేని నాని విషయంలో కొంత మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు. అయితే దాని వెనుక ప్రధాన కారణం ఏంటనేది తెలియకపోయినా కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలక నేతల విషయంలో పార్టీ అధిష్ఠానం త్వరలోనే కొన్ని చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
తిరుపతి ఎన్నికలు పూర్తయిన తర్వాత విజయవాడ తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలను పార్టీ నుంచి పంపించడానికి చంద్రబాబునాయుడు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అలాగే ఒక నియోజకవర్గానికి ఇంఛార్జిని కూడా మార్చే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలుస్తుంది. పార్టీలో సమస్యలు ఎక్కువగా సృష్టిస్తున్న నియోజకవర్గ నేతను మార్చడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమవటం జరిగింది.
విజయవాడ టిడిపి లో జరిగే ప్రతి వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాలతో సహా చంద్రబాబు నాయుడు వద్ద నానీ పెట్టడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఎవరు అనే దాని పై కేశినేని నాని ఒక నివేదిక కూడా సిద్ధం చేసి చంద్రబాబు నాయుడు వద్ద ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ పరిస్థితులు కాస్త తెలుగుదేశం పార్టీలో సంచలనాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.