ఎక్కడైనా ప్రాంతీయ పార్టీల్లో అధినేతలని దృష్టిలో పెట్టుకునే ప్రజలు..ఆయా పార్టీల వైపు మొగ్గు చూపుతారు. అధినేతల పట్ల పాజిటివ్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా ప్రజలు..వారి పార్టీలని గెలిపిచేస్తారు. గత ఎన్నికల్లో ఏపీలో జగన్ పట్ల ప్రజలు బాగా పాజిటివ్ గా ఉన్నారు. అందుకే వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. అసలు ఎమ్మెల్యే అభ్యర్ధి ఎవరు అనేది పెద్దగా చూడకుండా జగన్ బట్టి ఓటు వేసేశారు. అటు చంద్రబాబు సైతం..అన్నీ నియోజకవర్గాల్లో తానే అభ్యర్ధిని అనుకుని ప్రజలు గెలిపించాలని కోరారు. కానీ ప్రజలు బాబుని నమ్మలేదు.
అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరు నేతలు మళ్ళీ అదేవిధంగా ముందుకెళుతున్నారు. జగన్, చంద్రబాబు సైతం…మళ్ళీ తమనే చూసి ఓటు వేయాలనే విధంగా ప్రచారం చేస్తున్నారు. మరి ఈ సారి ఎవరిని ప్రజలు నమ్ముతారో చూడాలి. ఇక ఎంపీ సీట్లలో కూడా అదే ఫార్ములా వర్కౌట్ చేసేలా ఉన్నారు. కాకపోతే ఇక్కడ టీడీపీలో వింత పరిస్తితులు ఉన్నాయి. అన్నిచోట్లా ఎంపీ అభ్యర్ధి తానే అనే విధంగా బాబు ప్రచారం చేస్తే ఫలితం ఉండదు.
కనీసం బలమైన నాయకులని పెట్టాలి..ఆర్ధికంగా బలంగా ఉన్నవారిని పోటీకి దింపాలి. ఇప్పుడు వైసీపీకి అలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. టీడీపీకే అన్నీ చోట్ల బలమైన నేతలు లేరు..అసలు కొన్ని చోట్ల నాయకులే లేరు. అనకాపల్లి, అరకు, కాకినాడ, రాజమండ్రి, నరసారావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, నంద్యాల లాంటి స్థానాల్లో టీడీపీకి నాయకులే లేరు. అసలు నాయకులే లేకుండా..తానే ఎంపీ అభ్యర్ధిని అని బాబు చెప్పుకున్న ఉపయోగం ఉండదు.
కాబట్టి ఆయా స్థానాల్లో బలమైన నాయకులని బరిలో దింపాలి. కేవలం ఎమ్మెల్యే సీట్ల వరకే నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న బాబు..ఎంపీ సీట్లపై కూడా ఫోకస్ పెట్టాల్సి ఉంది. వైసీపీకి కంటే దాదాపు 25కి 21 సీట్లలో సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. వైసీపీకి రిస్క్ లేదు. ఎటు తిరిగి టీడీపీకే ఇబ్బంది. పైగా ఈ సారి కేంద్రంలో ఎవరికి పూర్తి మెజారిటీ వచ్చేలా లేదు. అందుకే ఎంపీ సీట్లు కూడా ముఖ్యమే.