మూడు నెలల్లోనే కూటమి ప్రభుత్వం పై రాష్టంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.. కొన్ని చోట్ల మంత్రులు పనితీరు.. మరికొన్ని మంత్రులు భార్యల పెత్తనాలతో పార్టీ డ్యామేజ్ అవుతోంది.. ఈ క్రమంలో మొన్న జరిగిన ఈ-క్యాబినెట్ లో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ పార్టీలో సంచలనం కల్గిస్తున్నాయి.. పనితీరు మెరుగు పరుచుకోవాలంటూ మంత్రులకు ఆయన ఆదేశాలిచ్చారట..
కూటమి సర్కారులో మంత్రులుగా ఉన్నవారి పనితీరును సీఎం అంచనా వేస్తున్నారని.. అందుకోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారనే ప్రచారం ఇటీవల ఊపందుకుంది.. ఈ క్రమంలో మంత్రి రాంబాబు ప్రసాద్ పోలీసుల పట్ల వ్యవహరించిన తీరును.. చంద్రబాబు సుతిమెత్తగా చెప్పిన విధానాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.. మంత్రుల పనితీరును ఆధారంగా వారికి ప్రోగ్రస్ రిపోర్ట్ కూడా ఇస్తారనే టాక్ వినిపిస్తోంది..
వివాదంగా మారుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారంపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎవ్వరూ ప్రవర్తించకూడదని.. ఎమ్మెల్యేలను కూడా ఆయా జిల్లాలకు చెందిన మంత్రులే కంట్రోల్ చెయ్యాలని ఆదేశించారట..
ఈ వందరోజుల పాలనలో మంత్రుల పనితీరు ఎలా ఉంది? ఏయే పనులు చేస్తున్నారు. ప్రజల రేటింగ్ ఎలా ఉంది..? అనే కీలక అంశాలపై వారికే సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా రిపోర్టు అందించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. వివాదాస్పదంగా ఉన్న ఎమ్మెల్యే పట్ల మెతకవైఖరి అవలంభిస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుందని.. అలాంటి వారితో పాటు.. మంత్రుల పనితీరు మీద కూడా నిఘా ఉంచాలని చంద్రబాబు తన స్వంత టీమ్ ను ఆదేశించారట..