BRS, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎం కి భయపడుతున్నాయి.. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

BRS, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎం కి భయపడుతున్నాయని చేవెళ్ల  ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత బెయిల్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికావని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిందని.. పలు దినపత్రికలలో వచ్చిన కథనాలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు  ఒకరికి మరొకరు పరస్పరం అవసరమని, బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని వెల్లడించారు.

బీజేపీ ప్రభావంతో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వలేదని..  అయితే సుప్రీంకోర్టు పై కాంగ్రెస్ పార్టీ అసహ్యకరమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. మూడింట రెండొంతుల మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారని.. ఇప్పుడు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని గుర్తుచేశారు. అదేవిధంగా హైదరాబాద్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆర్టీసీ బస్సులకు బీఆర్ఎస్ ప్రజలు డబ్బులు చెల్లించారని పేర్కొన్నారు. మరోవైపు  ఈ రెండు కూడా  కుటుంబ పార్టీలేనని పేర్కొన్నారు.  అందుకే  రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మొదటి షెడ్యూల్డ్ తెగ మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి వ్యతిరేకంగా ఓటు వేశాయని గుర్తు చేశారు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version