మీరు రైతులకు చేసింది సున్నా.. బీఆర్ఎస్‌పై జగ్గారెడ్డి కీలక కామెంట్స్

-

గత బీఆర్ఎస్ సర్కార్ తొమ్మిదేళ్ల పాలనలో రైతులకు చేసింది సున్నా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ త్వరలో ప్రజాక్షేత్రంలోకి వస్తారని వస్తున్న కథనాలపై ఆయన ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎనాడూ రైతుల సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదన్నారు. కేవలం ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారని, ప్రగతి భవన్‌కు ఎవ్వరినీ రానివ్వలేదని, సెక్రటేరియట్‌కు వెళ్లకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారని గుర్తుచేశారు.


కానీ, కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన మాట ప్రకారం మేము 9 నెలల్లో రుణమాఫీ చేశాం. రుణమాఫీ కోసం రూ.12వేల కోట్లు నిధులు రెడీగా ఉన్నాయి. సమస్య కేవలం రూ.2లక్షల రుణాల విషయంలోనే. కేసీఆర్ తొమ్మిదిన్నర యేండ్లలో సిస్టం అంతా ఖరాబ్ చేశారు.ప్రభుత్వానికి..బ్యాంకర్లకు మధ్య ఆన్లైన్ సిస్టం దెబ్బ తీశారు. అందుకే రుణమాఫీ ఆలస్యమైంది.వ్యవసాయ శాఖ అధికారుల విధానం కూడా దెబ్బతిశారు. కాంగ్రెస్ సర్కార్ ఇంటింటి సర్వే చేస్తున్నది..సెప్టెంబర్ నెలాఖరు వరకు అందరికీ మాఫీ అయిపోతుంది.అప్పుడు హరీష్ రావు అధికారం మజాలో ఉన్నాడు.

హరీష్‌కి లెక్కలే రావు..ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు.మేనమామ చెప్పింది చేయడమే హరీష్ రావు పని.
రాహుల్ గాంధీ వరంగల్ వస్తారు.. అసలు సంబరాలు అక్కడ చేస్తాం.రాహుల్ గాంధీని కొడంగల్ రా..ఇటు రా అనే స్థాయా నీది? సిద్దిపేటలో రైతులు లేరా? మా స్టేట్ లీడర్స్ లేరా..రాహూల్ గాంధీ కావాలా..? కోదండరెడ్డి…అన్వేష్ రెడ్డిలకు సిద్దిపేట పంపిస్తాం..ఏం కావాలో చెప్పుకో. రాహుల్ గాంధీ గురించి మళ్ళీ మాట్లాడితే..నా లాంగ్వేజ్ మారుస్తా.. అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version