క్యాడర్ కు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు.. మరో వారంలోనే వారందరికీ పదవులు..

-

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పల్లకి మోసిన క్యాడర్ కు పదవులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్దమవుతున్నారు.. మరో వారం రోజుల్లోనే నామినెటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఆయన సిద్దమవుతున్నారు.. దీంతో తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కోలాహలం అలుముకొంది.. జిల్లాల వారీగా పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలను అధినేత సేకరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. పార్టీ కోసం టిక్కెట్ త్యాగం చేసిన వారికి, సీనియర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం భావిస్తున్నారట.. జిల్లా స్థాయిలో ఉద్యోగుల బదిలీలు అనంతరం పోస్టుల పందేరం ఉంటుందని సమాచారం..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. గత ప్రభుత్వ హయాంలో పదవులు పొందిన వారిని రాజీనామాలు చెయ్యాలంటూ ప్రభుత్వ కార్యదర్శి జీవో విడుదల చేశారు.. ఈ క్రమంలో రాష్ట వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కీలక పదవుల్లో ఉన్న వారందరూ రాజీనామాలు చేశారు.. దీంతో ఖాళీ అయిన కార్పొరేషన్లు, ఇతర పదవుల సమాచారాన్ని పార్టీ అధినాయకత్వం ఇటీవల సేకరించింది. దీని ప్రకారం ముఖ్యమైన కార్పొరేషన్లు వందకు పైగా తేలాయట.. వాటితో పాటు సామాజిక వర్గాల వారీగా ఉన్న ఫెడరేషన్లు, జిల్లా స్థాయిలో నీటి సంఘాలు, వంటి పదవులను సైతం పరిగణలోకి తీసుకుని వాటిని క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన నేతలకు కట్టబెట్టాలని చంద్రబాబు ఆలోచనగా పార్టీ నేతలు చెబుతున్నారు..

క్యాబినెట్ విస్తరణతో సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చిన సీఎం చంద్రబాబునాయుడు.. వారి గెలుపులో కీ రోల్ పోషించిన వారికి కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారట. తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని కింది స్థాయిలో చిన్న దేవాలయాల వరకూ పాలక మండళ్ల నియామకానికి కూడా అవకాశం ఉండటంతో ఆయా ఆలయాలతో ప్రత్యేక అనుబంధం ఉన్నవారిని కూడా ఎంపిక చెయ్యాలని జిల్లా మంత్రులకు ఆదేశాలు సైతం జారీ చేశారట.. టీడీపీతో పాటు కూటమి పార్టీలుగా ఉన్న జనసేన, బిజేపీ కూడా ప్రాధాన్యతి ఇచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.. అయితే కీలకమైన పదవులను టీడీపీ నేతలకు ఇవ్వాలని కొందరు సీనియర్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆ దిశగా ఆయన ఆలోచనలు చేస్తున్నారట.. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకుని జనసేన, బిజేపీకి నేతలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని టీడీపీ ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు.. మొత్తంగా చూసుకుంటే మరో వారం, పదిరోజుల్లో నామినేటెడ్ పదవుల పందారం ప్రారంభం కాబోతుందన్నమాట..

Read more RELATED
Recommended to you

Exit mobile version