బీజేపీ – టీడీపీ మళ్ళీ కలుస్తాయా ? అంటే చంద్రబాబు ఆన్సర్ ఇదే !

-

ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు జాతీయ మీడియా ఛానల్ ఏఎన్‌ఐ‌తో మాట్లాడుతూ బిజెపి మరియు జనసేన పార్టీ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి రాజకీయ పార్టీ అయినా సరే వేరే పార్టీ తో కలిసి నడిచే హక్కు ఉందని తెలిపారు. అయితే ఆ ఇరుపార్టీల అంతర్గత నిర్ణయాలు మరియు ఒప్పందాలు మేరకు ఆ పార్టీ బలం ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రస్తుతం జనసేన మరియు బిజెపి పార్టీలు కలిసి పని చేస్తున్నాయని అది వారి అభీష్టమని చెప్పారు. ‘భవిష్యత్‌లో బీజేపీ, టీడీపీ మరోసారి కలిసి పనిచేసే అవకాశముందా’? అనే ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. ఊహాజనిత ప్రశ్నలకు రాజకీయాల్లో తాను సమాధానం చెప్పలేను అంటూ చంద్రబాబుకి ఆన్సర్ ఇచ్చాడు. అంతేకాకుండా రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు అంటూ వస్తున్న వ్యాఖ్యలపై ఆరోపణలపై మీడియా ప్రతినిధి చంద్రబాబును ప్రశ్నించగా..తాను కూడా రాయలసీమ ప్రాంత వాసి అని అక్కడే పుట్టడం పెరగడం జరిగిందని గుర్తు చేశారు.

 

ఇంతకీ రాయలసీమ కి ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని రాయలసీమ వాసులకు నీళ్లు ఎవరిచ్చారని చంద్రబాబు నిలదీశారు. అంతేకాకుండా తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రారంభిస్తే తాను పూర్తిచేశానని ఆయన చెప్పారు. మరియు అదే విధంగా కరువు జిల్లాగా పేరొందిన అనంతపురం జిల్లాకి కియా మోటార్స్‌ను తాను తీసుకొచ్చానని చంద్రబాబు గుర్తుచేశారు. శ్రీసిటీకి టీడీపీ హయాంలో పలు పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాని అదేవిధంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి గాని రాయలసీమ ప్రాంతాలకు మేలు చేసిన దాఖలాలు ఏమీ లేవు అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version