తెలంగాణలో ఆ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం.. కండిషన్స్ అప్లై!

-

తెలంగాణలో దసరా పండుగ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొననుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సైతం లోకల్ బాడీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని చూస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ సాధ్యమైనంతమేర అన్ని స్థానిక సంస్థలను దక్కించుకోవాలని చూస్తున్నది. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇతర పార్టీల కంటే ముందే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు.

అయితే, తెలంగాణలో ఇంకా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే వరంగల్ జిల్లా చెరువుకొమ్ము తండా సర్పంచ్ ఏకగ్రీవం అయ్యాడు. గ్రామంలో మూడు ఆలయాలు కట్టించి, బొడ్రాయి పండుగకు ఇంటికి రూ.వెయ్యి పంచుతానని దరావత్ బాలాజీ గ్రామంలో ప్రతిపాదన తెచ్చాడు. అయితే, అందుకోసం వచ్చే ఎన్నికల్లో ఎవరూ సర్పంచ్ గా పోటీ చేయవద్దని షరతు విధించాడు. అందుకు అంగీకరించిన గ్రామస్తులు అతిడితో అగ్రిమెంట్ చేసుకున్నారు.సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసి విజయోత్సర ర్యాలీ సైతం నిర్వహించారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version