ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది. మరి ఈ రెండేళ్లలో రాజకీయం ఏమన్నా మారిందా? పార్టీల బలాబలాలు ఏమన్నా మారయా? అంటే పూర్తి స్థాయిలో బలం ఏమి మారలేదు గానీ, కొంతవరకు అధికార వైసీపీ బలం తగ్గినట్లే కనిపిస్తోందని విశ్లేషణలు వస్తున్నాయి. మరి అధికారం కోల్పోయే అంతా స్టేజ్‌లోకి వైసీపీ రాలేదు గానీ, కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వస్తున్నట్లు సర్వేలు వస్తున్నాయి.
అందుకు ఖాళీగా ఉన్న స్థానాల్లో ఇంచార్జ్‌లని నియమిస్తున్నారు. అలాగే యాక్టివ్‌గా లేని నాయకులని యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఎన్నికలు ఇప్పుడే లేవని ఏ నాయకుడు అలసత్వం వహించిన, పార్టీ బలోపేతం చేసే కార్యక్రమం చేయకపోయినా సరే వారిని పక్కనబెట్టేస్తామని చినబాబు, పలువురు టిడిపి నేతలకు వార్నింగ్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు, నారా లోకేష్, ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడులు వరుసపెట్టి నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్‌లతో, నాయకులతో, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రెండు, మూడు నెలల్లో వీక్‌గా ఉన్న ఇంచార్జ్‌లు పికప్ అవ్వకపోతే, వారిని పక్కనబెట్టేసి కొత్తవారికి ఛాన్స్ ఇస్తామని చినబాబు హెచ్చరిస్తున్నారని తెలిసింది. ఇప్పటికైనా పార్టీ కోసం పనిచేయకపోతే అలాంటి వారిని ఉపేక్షించే పనే లేదని చెప్పేస్తున్నారట. మొత్తానికి చినబాబు తనలో ఉన్న ఫైర్ అంతా బయటపెడుతున్నట్లు కనిపిస్తోంది.