పవన్‌ని తిట్టినవాళ్లతో చిరంజీవి..ఇబ్బందేనట..!

-

రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ చేయడం సహజంగానే జరిగే ప్రక్రియ. అయితే ఈ విమర్శల పర్వం ఒకప్పుడు నడిచింది..ఇప్పుడు బూతులు తిట్టుకోవడమే. ఏపీలో ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ బూతుల రాజకీయం మరింత పెరిగిందనే విమర్శలు ఉన్నాయి. సరే ఎవరు బూతులు మాట్లాడటం మొదలుపెట్టారనే విషయం పక్కన పెడితే…ఇప్పుడు అన్నీ పార్టీలో అదే పనిలో ఉన్నాయి. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం..పైగా ప్రత్యర్ధులు బూతులు మాట్లాడుతున్నారని నీతి కబుర్లు చెప్పడం అలవాటైంది.

ఈ బూతులు తిట్టుకోవడంలో వైసీపీ-టీడీపీ-జనసేన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితాలని కూడా బయటకు లాగి తిడుతూ ఉంటారు. దీని వల్ల రాజకీయాల్లో విలువలు పూర్తిగా దిగజారిపోయాయని చెప్పవచ్చు. అయితే జనసేన అధినేత పవన్ పెళ్లిళ్లు గురించి వైసీపీ ఏ స్థాయిలో విమర్శిస్తుందో చెప్పాల్సిన పని లేదు. అయినా సరే పవన్ క్రుంగిపోకుండా ఇంకా పోరాడతారు.

 

ఇలా పవన్‌ని తిట్టడంపై తాజాగా చిరంజీవి స్పందించారు..ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తమ్ముడైన సరే పవన్‌ని కొడుకులా చూసుకున్నామని అన్నారు. సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో పవన్ అన్నీ వదిలేసిన యోగిలాంటి వాడని చిరంజీవి అభివర్ణించారు. ఇక పవన్‌ను రాజకీయాల్లో కొందరు మితిమీరి మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుందని, పవన్‌ను తిట్టినవాళ్ల తన వద్దకు వచ్చి పెళ్లిళ్లకు..పేరంటాలకు పిలుస్తారని..రమ్మని బ్రతిమలాడతారని చెప్పుకొచ్చారు. తన తమ్ముడిని అన్ని మాటలు అన్నవాళ్లతో మాట్లాడాల్సి వస్తుంది..కలవాల్సి వస్తుందనే బాధ ఉంటుందని చిరంజీవి తన మనసులో మాట చెప్పుకొచ్చారు.

మొత్తాన్నికి పవన్‌ని ఎక్కువ టార్గెట్ చేశారనే విషయం చిరంజీవికి అర్ధమైంది. అయితే అలా పవన్‌ని తిట్టి..చిరంజీవితో మాట్లాడే వారు వైసీపీ నేతలే అని అంటున్నారు. మొత్తానికి పవన్‌కు సపోర్ట్ గానే చిరంజీవి ఉన్నారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version