చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా..రాజకీయాల్లో వచ్చి పెద్ద తప్పు చేశానన్న భవనలో ఉన్న మెగస్టార్ మళ్లీ ప్రజా జీవితంలో అడుగుపెడతారా..నాదెండ్ల మనోహర్ మాటలను చూస్తే మాత్రం కాస్త అనుమానం ఉన్నా రాజకీయాల్లో వస్తానన్న రాజనీకాంత్ ని సైతం వద్దని వారించిన చిరు మళ్లీ రాజకీయ ప్రవేశం మాత్రం కాస్త నమ్మబుద్ధి కాని విషయమే.
జనసేనలో నంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తాజాగా సంచలన వ్యాఖ్యలే చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి అండదండలు పుష్కలంగా ఉన్నాయని బాంబు పేల్చారు. జనసేన నుంచి ఎపుడూ ఇంత క్లారిటీగా చిరంజీవి విషయంలో స్టేట్ మెంట్ రాలేదు. దాంతో పంచాయతీ ఎన్నికల వేళ ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.ఎంతైనా ఇద్దరికీ రక్త సంబంధం. పైగా తమ్ముడికి ఎపుడూ అన్న అండ ఉంటూనే ఉంటుంది. ఇదంతా కామన్ అని అనుకున్నా ఎక్కడో సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయి.
పవన్ రాజకీయ జీవితం సక్సెస్ కావాలని కోరుకునే వారిలో చిరంజీవి ఎలాగూ ఉంటాడు. అందువల్ల ఆయన మద్దతు ఎపుడూ తమ్ముడికే ఉంటుంది. తన ఇంట్లోనే ఒక పార్టీ ఉండగా వేరే పార్టీల వైపు మెగాస్టార్ కన్నెత్తి చూడడం కూడా జరగదు. అయితే చిరంజీవి మళ్లీ జనంలోకి వచ్చి ప్రచారం చేస్తారనేది మాత్రం అవాస్తవమే. అది జరగని విషయం కూడా. తాను మళ్ళీ సినీ హీరోగానే పుట్టాలని కోరుకుంటున్నట్లుగా చెప్పిన చిరంజీవి తమ్ముడి పార్టీ అయినా జనంలోకి వెళ్ళి ప్రచారం చేయరు అని అంటున్నారు. అయితే చిరంజీవి తెర వెనక నుంచి మద్దతు ఇస్తారని చెబుతున్నారు. ఆ మద్దతు కూడా చాలా విలువైనదే అని అంటున్నారు.
తిరుపతి ఉప ఎన్నికలో ఆయన సహకారం ఉంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జనసేన మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నిజానికి గత ఎన్నికలలో ఘోర పరాజయమే కాదు, పోటీ చేసిన రెండు చోట్లా ఓడిన తరువాత మరొకరు అయితే ఈపాటికి పార్టీని ఏనాడో మూసేసేవారు. అయితే ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాలు పవన్ కి కొత్త ఆశలు రేపాయి. ఇక బీజేపీ వంటి జాతీయ పార్టీతో జట్టు కట్టి పార్టీని ముందుకు తీసుకువెళ్తున్న పవన్ కి స్థానిక ఎన్నికల రూపంలో ఒక పెద్ద చాన్స్ వచ్చింది. ఇక్కడ కనుక కొద్దో గొప్పో పార్టీ తన ప్రభావం చూపిస్తే అది 2024 నాటికి ఆశలను సజావుగా ఉంచుతుంది.
ఇక ఈ సమయంలో పవన్ బలం ఒక్కటే సరిపోదు అని భావించే నాదెండ్ల మనోహర్ వ్యూహాత్మకంగానే చిరంజీవి ప్రస్థావనను తెచ్చారని అంటున్నారు. పవన్ వెనక మెగాస్టార్ ఉన్నారు అంటే ఒక్క ఓటు కూడా చీలకుండా ఫ్యాన్స్ అంతా ఒకే వైపు కొమ్ము కాస్తారు. అందుకే చిరంజీవిని రాజకీయ తెర మీదకు తెచ్చారని వినిపిస్తోంది. మరి చూడాలి ఎంత మేరకు అన్నదమ్ముల ఉమ్మడి బలం జనసేనను ముందుకు ఎలా పిస్తుందో.