ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజ్యసభ సీట్ల సందడి నెలకొంది. అధికార వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు గాను కొందరు ప్రముఖులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది వైసీపీ రాజ్యసభ ఎంపీల సంఖ్య ఆరుకి పెరగనున్న నేపధ్యంలో పెద్దల సభలో కూర్చోవడానికి గాను తీవ్రంగానే ప్రయత్నాలే చేస్తున్నారు కొందరు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
చిరంజీవి సైరా సినిమా తర్వాత జగన్ ని కలిసి సినిమా చూడాలని కోరారు. అప్పటి నుంచి కూడా చిరంజీవి, జగన్ కి కాస్త సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే విశాఖలో రాజధాని ఏర్పాటుని చిరంజీవి స్వాగతి౦చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక మోహన్ బాబు విషయానికి వస్తే జగన్ కి ఆయన బంధువు కావడంతో రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
అయితే చిరంజీవి సిని పరిశ్రమలో పలుకు బడి ఉండటంతో, తనకు ఉపయోగం అని భావిస్తున్న జగన్, చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిని గమనించిన మోహన్ బాబు ముందుగానే మోడిని కలిసారని సమాచారం. జగన్ ఎక్కువగా చిరంజీవి వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో మోహన్ బాబు బిజెపిలోకి వెళ్ళే అవకాశం ఉందని కూడా ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది.