ఐదేళ్ల పాటు ఏపీకి జగన్ సీఎంగా ఉండగా మరో ఐదేళ్లు కూడా ఆయనే సీఎంగా కొనసాగే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రూరల్, అర్బన్ ఏరియాలలో పథకాల ప్రయోజనాలు పొందిన వాళ్లంతా మళ్లీ జగన్ నే గెలిపించుకుంటామని చెబుతున్నారు.వైసీపీ అభ్యర్థులు పట్టు విడవకుండా చివరి నిమిషం వరకు ప్రచారం చేయడం పార్టీకి కలిసొచ్చింది.జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రమే ఇప్పటివరకు అమలైన పథకాలు కొనసాగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
రాష్ట్రంలో వృద్ధులు, మహిళలు రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల రాష్ట్రంలో వైసీపీ సులువుగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆ నియోజకవర్గాల్లో వైసీపీకి చెక్ పెట్టే అవకాశం అయితే లేదని తెలుస్తోంది.ప్రతి జిల్లాలో సగానికి పైగా సీట్లు వైసీపీకే వస్తాయని తెలుస్తోంది.