BREAKING: సీఎం కేసీఆర్ కు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఫోన్… ఈనెల 20న భేటీ

-

దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ఎన్డీయేత పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. త్వరలోనే ఎన్డీయేతర పార్టీల సీఎంలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ… తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లకు ఫోన్లు కూడా చేశారు. మరోవైపు త్వరలోనే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తానని అన్నారు.

అయితే ఈరోజు సీఎం కేసీఆర్ కు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేశారు. ఈనెల 20న లంచ్ కు ఆహ్వానించారు ఉద్ధవ్ ఠాక్రే. ఈ ఆహ్వనం మేరకు ఈనెల 20న ముంబై వెళ్లనున్నారు కేసీఆర్. వీరిద్దరి మధ్య రాజకీయాలపై చర్చ జరగనుంది. బీజేపీకి వ్యతిరేఖంగా పోరాడేందుకు సీఎం కేసీఆర్ కు ఉద్దవ్ ఠాక్రే మద్దతు ప్రకటించారు.

“కేసిఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం…”అంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

బీజేపీని ఎదుర్కొనేందుకు .. అన్ని పార్టీలు సమాయత్తం కావాల్సి ఉందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీనికి కొత్తగా యూపీఏ, ఎన్డీయేతర కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు పలు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. నిన్న మాజీ ప్రధాని దేవెగౌడ కూడా సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశారు. మతతత్వ రాజకీయాలకు వ్యతిరేఖంగా పోరాడుతున్న కేసీఆర్ కు మద్దతు ప్రకటించారు. త్వరలోనే బెంగళూర్ వస్తానని సీఎం కేసీఆర్, దేవెగౌడతో అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version