మెడ మీద కత్తి: ఎరక్కపోయి ఇరుక్కున కేసీఆర్!

-

ధాన్యం కొనుగోలు అంశంలో కేసీఆర్…కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్రం యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ తీసుకోబోమని చెప్పేసింది. దీంతో కేసీఆర్ కూడా…యాసంగిలో వరి వేయొద్దని తెలంగాణ రైతులకు తేల్చి చెప్పేశారు. యాసంగిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని, ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులు ఎత్తేసిందని, ఉప్పుడు బియ్యం(పారా బాయిల్డ్ రైస్) కొనేది లేదని కేంద్రం కరాఖండిగా చెప్పడంతో రాష్ట్ర మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

kcr

అయితే పారా బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేసీఆర్.. ముందు కేంద్రానికి హామీ ఇచ్చారు. గత యాసంగి ఉప్పుడు బియ్యం తీసుకోవాలని డిమాండ్‌ చేయగా, భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం ఇవ్వమంటూ అండర్‌ టేకింగ్‌ ఇస్తేనే ఇప్పుడు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసిందని, మెడ మీద కత్తి పెట్టి మరీ అండర్‌ టేకింగ్‌ రాయించుకున్నారని కేసీఆర్ తెలిపారు.

అంటే ఈ విషయంలో కేసీఆర్ తప్పు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. పైగా కేంద్రంపై నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఉప్పుడు బియ్యం కొనకపోతే వేరే రకానికి చెందిన వరి విత్తనాలు 7 రకాలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారని, మ‌రీ పారా బాయిల్డ్ రైస్ కాకుండా ఆ విత్త‌నాల‌ను రైతుల‌కు అంద‌జేస్తే కేంద్రం కొంటుందని.. స‌మ‌స్యే ఉండ‌దు క‌దా అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అలాగే మెడ మీద కత్తి పెడితే… ఫామ్‌ హౌజ్‌ రాసిస్తావా అంటూ ఫైర్ అయ్యారు.

అటు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం… కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. మెడ మీద కత్తి పెట్ట కేంద్రం ధాన్యం కొనుగోలు ఒప్పందంపై సంతకం పెట్టించుకుందని చెబుతున్న కేసీఆర్… మెడ మీద కత్తి పెడితే తన పదవిని వదులుకుంటారా? అని రేవంత్ ప్రశ్నించారు. అంటే అనవసరం మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారని చిన్నపిల్లల కథల చెప్పినట్లు కేసీఆర్ చెప్పి…అనవసరంగా బుక్ అయ్యారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version