నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆశలు.. లిస్ట్ రెడీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..

-

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది.. ఎమ్మెల్యేగా గెలిచిన కొందరికి క్యాబినెట్లో బెర్తులు ఖరారు అయ్యాయి.. మరి కొంతమందికి కూడా త్వరలో మంత్రి పదవులు రాబోతున్నాయని ప్రచారం జరుగుతుంది.. ఈ క్రమంలో నామినేటెడ్ పదవుల పై సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు.. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి లిస్టును రెడీ చేస్తున్నారట..

నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న జిల్లాల్లో వరంగల్ ప్రథమ స్థానంలో ఉంది.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. పది స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.. ఉద్యమాలకు రాజకీయాలకి కేరాఫ్ గా ఉండే ఈ జిల్లాలో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న ఆశావాహుల జాబితా చాంతాడు అంత వుంది.. ఇప్పటికే ఈ జిల్లా నుంచి ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, సీతక్క రేవంత్ క్యాబినెట్లో మంత్రులుగా కొనసాగుతుండగా.. మరింత మందికి నామినేటెడ్ పదవులు వస్తాయని జిల్లాలో ప్రచారం జరుగుతుంది.. ఎన్నికల్లో టికెట్ ఆశించి బంగపడిన నేతలు.. అభ్యర్థులు గెలుపులో కీలక పాత్ర పోషించిన నేతలు పదవులు ఆశిస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు..

గత ప్రభుత్వంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎనిమిది మందికి కార్పొరేషన్ చైర్మన్ లుగా అప్పటి సీఎం కేసీఆర్ నియమించారు.. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అంతకు మించి పదవులు వస్తాయని కేడర్ భావిస్తుంది.. ఈ క్రమంలో మంత్రుల వద్దకు, ఢిల్లీ నాయకుల వద్దకు సిఫారసుల కోసం వెళ్తున్నారట.. మాజీ మేయర్ ఎర్రబల్లి స్వర్ణ, టిఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రంథాలయ చైర్మన్ గా ఉంటూ చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అజిజ్ ఖాన్, మాజీ మేయర్ ప్రకాష్, టిక్కెట్ ఆశించి భంగపడ్డ ఇణగాల వెంకటరామిరెడ్డి, ములుగు డిసిసి అధ్యక్షుడు అశోక్ ఇలా అనేకమంది ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీలో ప్రచారం నడుస్తోంది.. ఇంతకీ నామినేటెడ్ పదవులు ఎవరిని వరిస్తాయో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Exit mobile version