ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న బిఆర్ఎస్ పార్టీలో ఎన్నికల హడావుడి మొదలైంది.. పెద్దలసభకు పోటీ చేసే అవకాశం కోసం గులాబీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.. త్వరలో ఖాళీ కానున్న ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు.. ఓటరు జాబితా నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు..
రాష్టంలో మూడు ఎమ్మెల్సీ స్తానాల పదవి కాలం మార్చి 29తో ముగియనుంది.. ఇందులో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు కాగ, ఒకటి పట్టభద్రుల నియోజకవర్గం.. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన జీవన్ రెడ్డి.. పదవి కాలం పూర్తికానుంది.. ఈ క్రమంలో అక్కడ ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ కసరత్తు ప్రారంభించింది.. ఓటర్ల జాబితా కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.. డిసెంబర్ 12న ఓటర్ల తుది జాబితా ప్రచురణ కాబోతుంది.. సంకాంత్రి తర్వాత ఎన్నికలు ఉండే అవకాశముంది..
ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో.. టిక్కెట్ కోసం బీఆర్ ఎస్ నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు ప్రారంభించారు.. బిఆర్ఎస్ నుంచి కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టీఎస్ టీస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్, బేవరేజ్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ లతో పాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ కు చెందిన రాజారాం యాదవ్, మెదక్ జిల్లాకు చెందిన చంటి రాహుల్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.. వీరందరూ తమకు అనుకూలంగా ఉన్నవారిని ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. పార్టీలోని కీలక నేతలను కలిసి తమ ప్రయత్నాలను వివరిస్తున్నారు.. కేసీయార్ ఆశీస్సుల కోసం ఎదరుచూస్తున్నారు.. కేసీఆర్ తమకు అనుకూలంగా ఉన్నారని.. మీరు కూడా సపోర్ట్ చెయ్యాలంటూ కీలక నేతలను కోరుతున్నారు.. ఇంతకీ కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయో చూడాలి మరి..