డిసెంబర్ 9 లోపు పూర్తిస్థాయి రుణమాఫీ – మంత్రి తుమ్మల

-

దసరా పర్వదినాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 36.5 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. డిసెంబర్ 9 లోపు పూర్తిస్థాయిలో రుణమాఫీ కంప్లీట్ చేస్తామని అన్నారు.

పంటల భీమాకు పథకం అమలు చేస్తామన్నారు. అలాగే రైతు భరోసా కు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలలో పామాయిల్ సాగుకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు తుమ్మల. పామాయిల్ పంటకు టన్నుకు 20వేల ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి పామాయిల్ మొక్క అందేలా చూస్తామని తెలిపారు.

1986లో ఎన్టీఆర్ పెదవేగిలో మొక్క నాటారని.. 1990 తర్వాత తెలంగాణలో వేశామన్నారు. అవసరమైతే రాష్ట్రాల అధినేతలతో కలిసి కేంద్రం దగ్గరికి వెళతామన్నారు తుమ్మల. వచ్చే నెలలో మరో 1300 పెరుగుతుందని, రాహుల్ గాంధీ సారథ్యంలో 20వేల కంటే ఎక్కువ వచ్చేలా ప్రణాళికలు చేసుకుందామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version