జీ 23 నేతల డిమాండ్లతో సోనియా, రాహుల్ తో గులాంనబీ ఆజాద్ భేటీ..!

-

కాంగ్రెస్ పార్టీలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముసలానికి దారితీశాయి. ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ తన ఉనికిని బలంగా చాలుకోలేదకపోయింది. ఏళ్ల చరిత్ర ఉన్న ఓ జాతీయ పార్టీ తన స్థాయికి తగ్గట్లు పనితీరు కనబర్చలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అసంత్రుప్తులు గళం విపుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీ 23తో పిలవబడుతున్న వారు వరసగా సమావేశం అవుతున్నారు. గులాం నబీ ఆజాద్, శశి థరూర్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, ముకుల్ వాస్నిక్, రేణుకా చౌదరీ, మిలింద్ దేవరా, మనిష్ తివారీ వంటి నేతలు వరసగా సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కపిల్ సిబల్ ఓ ఆడుగు ముందుకు వేసి ఇంటి కాంగ్రెస్ వద్దని అందరి కాంగ్రెస్ కావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబం నుంచి పార్టీ పగ్గాలను వేరే వారికి అప్పగించాలని కపిల్ సిబల్ కోరుతున్నారు. 

తాజాగా జీ 23 నేతల డిమాండ్లతో  గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జీ 23 నేతలు చేసిన ప్రతిపాదనలు, డిమాండ్లను సోనియా, రాహుల్ కు వివరించనున్నారు ఆజాద్. త్వరలోనే ఆజాద్ తో పాటు మరికొంత మంది జీ 23నేతలు వీరిద్దరిని కలవనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version